Begin typing your search above and press return to search.

నాగశౌర్యకు భలే సమస్య వచ్చేందే !

By:  Tupaki Desk   |   18 May 2021 7:30 AM GMT
నాగశౌర్యకు భలే సమస్య వచ్చేందే !
X
సినిమా ఆఫర్స్ రావటం వేరు. వాటిని సరిగ్గా ప్రమోట్ చేసుకుని,జనాల్లోకి తీసుకెళ్లి హిట్ కొట్టడం వేరు. ఈ రెండు కరెక్ట్ గా ఉంటేనే కెరీర్ సాఫీగా వెళ్లిపోతుంది. ఎక్కడ డిస్ట్రబ్ అయినా మొత్తం దెబ్బకొట్టేస్తుంది. ఇప్పుడు నాగశౌర్య అలాంటి సమస్యలోనే ఉన్నాడట. ఈ మధ్యకాలంలో హిట్,ప్లాఫ్ కు సంభంధం లేకుండా బిజీ అయ్యిన హీరో నాగ శౌర్య. పెద్ద హీరోలతో ట్రైల్స్ వేసి విసిగిపోయే కన్నా నాగశౌర్య లాంటి మీడియం హీరోతో హిట్ కొట్టి నెక్ట్స్ లీగ్ లోకి వెళ్లిపోదామనుకునే డైరక్టర్స్ పెరిగిపోయారు. ఈ క్రమంలో నాగశౌర్య ఫుల్ బిజీ అయ్యిపోయాడు. ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నాడు.

నాలుగు సినిమాలు అంటే రెమ్యునేషన్ బాగానే ముట్టి ఉంటుదని అనుకోవచ్చు కానీ,గ్యాప్ లేకుండా వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ప్రతీ ప్రాజెక్టుకు న్యాయం చేయాలి. అలాగే నాగ శౌర్య తన కెరీర్ లో పీక్ పీరియడ్ గా భావించి ఈ నాలిగింటిలో రెండు హిట్ అయినా మరో నాలుగేళ్లు ఏ ఢోకా లేకుండా దూసుకుపోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు. దానికి తోడు నిర్మాతగా తను పోగొట్టుకున్న సొమ్ముని ఈ సినిమాలు రికవరీ చేస్తాడని భావించాడు. అయితే కరోనా అతని ప్లాన్స్ పై పెద్ద దెబ్బే కొట్టింది. ఒకటి రెండు సినిమాలు ఒప్పుకున్న హీరోలు కూల్ గా కూర్చుంటే నాగశౌర్యకు ఎక్కడలేని టెన్షన్ ని ఆ సినిమాలు తీసుకొస్తున్నాయి.

దాదాపు నాలుగు సినిమాల్లో రెండు ఫినిషింగ్ స్టేజికి వచ్చి ఆగాయి. కొన్ని రోజుల షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉంది. అసలు అన్ని బాగుంటే.. ఈ వేసవి సెలవుల్లోనే ‘వరుడు కావలెను’ విడుదల కావాలి.దానికి బ్రేక్ పడింది. అలాగే, ‘లక్ష్య’ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజికు చేరుకునని ఆగింది. ఇక అవసరాల శ్రీనివాస్ తీస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, మహేష్ కోనేరు నిర్మిస్తున్న ‘పోలీస్ వారి హెచ్చరిక’ ప్రొడక్షన్ దశలోనే ఆగాయి. ఇప్పుడు నాగశౌర్య ముందున్న టార్గెట్ ...వరసపెట్టి ఆ సినిమాలు ఫినిష్ చేసుకుని ,ప్రమోట్ చేసుకుని రిలీజ్ చేసుకోవాలి. తన సినిమాలు తనకే అడ్డుపడకుండా రిలీజ్ లు ప్లాన్ చేసుకోవాలి. అలాగని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోరు. నాగశౌర్య మరి ఎలా ప్లాన్ చేసి ఈ సినీ కష్టాల నుంచి బయిటపడతాడో చూడాలి.