Begin typing your search above and press return to search.

యువ హీరో హోమ్ ప్రొడక్షన్ మూవీ చాలా లేట్ అయ్యేలా ఉందే..!

By:  Tupaki Desk   |   26 Nov 2020 2:30 AM GMT
యువ హీరో హోమ్ ప్రొడక్షన్ మూవీ చాలా లేట్ అయ్యేలా ఉందే..!
X
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ బిజీగా మారిపోయాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. దీంతో పాటు లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో 'వరుడు కావలెను' అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో హోమ్ బ్యానర్ లో 'అలా ఎలా' ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేసాడు. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మించనున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ కి వెళ్ల‌డానికి ఇంకా టైమ్ ప‌ట్టేలా ఉంద‌ని ఫిలిం అంటున్నారు. దీనికి కార‌ణం శౌర్య ఇప్పుడు వ‌రుస సినిమాలు క‌మిట్ అవ్వ‌డం అనే టాక్ ఉంది. 'వరుడు కావలెను' సినిమా మరియు #NS20 ప్రాజెక్ట్స్ ముగిసాకే శౌర్య త‌న సొంత బ్యాన‌ర్ లో సినిమా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. దీంతో అనీష్ కృష్ణ ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. శ్రీ విష్ణు - రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలతో 'గాలి సంప‌త్' అనే సినిమాను ప‌ట్టాలెక్కించాడు. ఈ సినిమా పూర్తి చేసి నాగశౌర్య తో సినిమా స్టార్ట్ చేస్తాడు.