Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ ను ఇలా కూడా ఎంజాయ్‌ చేస్తున్న శౌర్య

By:  Tupaki Desk   |   9 Aug 2020 7:10 AM GMT
లాక్‌ డౌన్‌ ను ఇలా కూడా ఎంజాయ్‌ చేస్తున్న శౌర్య
X
సినిమా షూటింగ్స్‌.. కథ చర్చలు.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అంటూ సినిమా స్టార్స్‌ మరియు ఇతర యూనిట్‌ సభ్యులు ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే వారు. కాని ప్రస్తుతం కరోనా టైం కావడంతో ఏ ఒక్కరు బయటకు వెళ్లడం లేదు. ముఖ్యంగా హీరోలు ఎవరు కూడా భయంతో కనీసం అడుగు బయట కూడా పెట్టడం లేదు. ఆమద్య షూటింగ్స్‌ చేద్దామని అనుకున్నా కూడా పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే బాబోయ్‌ అనిపిస్తుంది. కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ లో ఉన్న మాదిరిగానే ఇంకా ఇంటి వద్ద వారి వారి కుటుంబ సభ్యులు పెట్స్‌ తో ఎంజాయ్‌ చేస్తున్నారు. నాగ శౌర్య ఈ క్వారెంటైన్‌ పీరియడ్‌ ను ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా ఆయన సోషల్‌ మీడియా పోస్ట్‌ లను చూస్తుంటే అర్థం అవుతోంది.

ఇటీవల తన పెట్‌ డాగ్‌ తో ఆడుకుంటూ దానికి సపర్యలు చేస్తూ ఉన్న ఒక వీడియోను కొన్ని ఫొటోలను షేర్‌ చేసిన ఈ యంగ్‌ హీరో ఇప్పుడు ఈ ఫొటోను షేర్‌ చేశాడు. స్నూకర్‌ గేమ్‌ ఆడుతూ కనిపించాడు. పక్కనే కుక్కను పెట్టుకుని చాలా సీరియస్‌ గా స్నూకర్‌ ఆడుతున్నాడు. ఎవరో స్నూకర్‌ గేమ్‌ అనేది బాల్స్‌ తో ఆడే చెస్‌ గేమ్‌ వంటిదే అన్నారు. నిజమే నేను స్నూకర్‌ కు అడిక్ట్‌ అయ్యాను అంటూ సరదాగా కామెంట్‌ పెట్టాడు. స్నూకర్‌ గేమ్‌ తో ఎక్కువ సమయం గడుపుతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.