ఫోటో స్టోరి: మామ అల్లుళ్లు అచ్చంగా..!

Fri Nov 08 2019 18:28:20 GMT+0530 (IST)

Naga Chaitanya and Venkatesh In Venky Mama

మామా అల్లుళ్లు ఊళ్లో కాలక్షేపానికి ఇలా ఫోజు కొడుతున్నారా?  ఏమిటీ ఫోజు..?  మా ఊరు మా ఇష్టం! అన్నట్టుగానే ఉందీ ఫోజు. ఊరిలో తమను మించిన ఫోజుల రాయుళ్లు వేరే ఎవరుంటారు? అన్నట్టుగానే ఉందీ వ్యవహారం. రియాలిటీలో ఎలానో స్క్రీన్ మీదా అలానే ఫోజులు కొడుతున్నారు. అసలు మామా అల్లుళ్లుగా ఆ ఇద్దరి కెమిస్ట్రీ చూస్తుంటే స్టన్నింగ్ అని పొగిడేయకుండా ఉండలేం.తొలి పోస్టర్ పడినప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీకి.. యాప్ట్ బాడీ లాంగ్వేజ్ కి ప్రశంసలు దక్కాయి. అసలు మామా అల్లుళ్లు అంటే ఇలా ఉండాలి! అంటూ పొగిడేశారంతా. మొన్న దసరా దీపావళి పండగలకు రిలీజ్ చేసిన పోస్టర్లలోనే అల్లుడు నాగచైతన్య ఆర్మీ గెటప్ లో దిగిపోయి మరింత సర్ ప్రైజ్ ఇచ్చాడు. మామ వెంకీ ఊళ్లో ఆర్మీ అయితే.. అల్లుడు చైతూ బార్డర్ లో ఆర్మీ మేన్ అని అభిమానులు అర్థం చేసుకున్నారు.

పల్లెటూళ్లో మోతుబరులు అసలే! మామ అల్లుడికి బ్యాక్ బోన్.. అల్లుడు మామకు అండా దండా! అని మొన్న టీజర్ చూడగానే అర్థమైంది. ఫన్ ఒక్కటే కాదు ఉతికి ఆరేయడంలోనూ అల్లుడికి మామ ఇచ్చిన ట్రైనింగ్ కి పరేషాన్ అయిపోయారు ఫ్యాన్స్. మరో కొత్త లుక్ తాజాగా రివీలైంది. గళ్ల చొక్కాయ్ బులుగు జీను ఫ్యాంటు .. కాంబినేషన్ రెబాన్ తో అల్లుడు ఇచ్చిన ఫోజు అదిరిపోయింది. చొక్కా పై గుండీలు విప్పి కాస్త రెబల్ గానే కనిపిస్తున్నాడు చైతూ. ఆ పక్కనే మామ ఏమైనా తగ్గాడా? అంటే అలాంటిదేం లేదు. అల్లుడికి తగ్గ మామ అనిపించుకుంటున్నాడు. ఖద్దరు తొడిగి పెద్దరికం చూపిస్తున్నాడు. అరవింద్ కాటన్ డిజైనర్ చొక్కా తొడిగి ఎలా స్మైలిస్తున్నాడో చూశారుగా!  మొత్తానికి ఒక్కో పోస్టర్ తో పండగ తెస్తున్నారనే చెప్పాలి. డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు తేదీ మార్చారని ప్రచారమవుతోంది. అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్.