ఫోటో స్టొరీ: చై-సామ్ ల పెట్ ఇదిగో

Thu Nov 08 2018 20:15:15 GMT+0530 (IST)

Naga Chaitanya Samantha baby

మన జనాలు ఎలా ఉంటారంటే.. బ్యాచిలర్ గా ఉన్నన్ని రోజులూ 'పెళ్ళెప్పుడూ.. పెళ్ళెప్పుడూ' అంటూ ప్రాణం తీస్తారు.  సరే అని ఎవరినో ఒకరిని చూసుకుని ఆ మూడు ముళ్ళు వేసేస్తే కనీసం నాలుగు నెలలు కూడా ఊపిరి పీల్చుకోనివ్వరు.  "పిల్లలెప్పుడు.. పిల్లలెప్పుడు?' అని సతాయిస్తారు.  ఈ వేధించడం ఎప్పటికీ ఆగదు.  పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత 'వాళ్ళ పెళ్ళెప్పుడూ.. పెళ్ళెప్పుడూ' అని కొత్త రాగం అందుకుంటారు.అక్కినేని నాగ చైతన్య - సమంతా జంట ఈమధ్యనే తమ మొదటి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు పైన చెప్పుకున్నట్టు సెకండ్ స్టేజ్ లో ఉన్నట్టు.  కానీ వాళ్ళు ఈ కాకుల్లాంటి లోకుల మాటలు పట్టించుకోకుండా ఒక అందమైన పప్పీ ని ఇంటికి తెచ్చుకున్నారు. దాన్ని పెంచుకుంటున్నారు.  తమ పప్పీ హాయిగా నిద్రపోతున్నఒక ఫోటోను సోషల్ మీడియా లో సమంతా పోస్ట్ చేసింది.  ఆ ఫోటోలో చై సామ్ లు ఇద్దరూ దాన్ని ప్రేమగా చూస్తున్నారు. ఈ ఫోటోకు 'అదంతే.. మ్యాజిక్' అని క్యాప్షన్ ఇచ్చింది.

అక్కినేని ఫ్యామిలీమెంబర్స్ కు కుక్కలంటే చాలా ప్రేమ అన్న సంగతి తెలిసిందే. ఇక అమల బ్లూ క్రాస్ ద్వారా యానిమల్ రైట్స్ కోసం తన గళాన్ని తరచూ వినిపిస్తుంటారు. ఇప్పుడు తాజాగా చై-సామ్ లైఫ్ లోకి ఈ పప్పీ రూపంలో న్యూ మెంబర్ వచ్చింది.  ఇదిలా ఉంటే చై- సామ్ ఇద్దరూ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.  ఆ సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తుండడం విశేషం.