మొన్న సమంత.. ఇప్పుడు చైతూ కొత్త ప్రయత్నం

Tue May 04 2021 11:06:10 GMT+0530 (IST)

Naga Chaitanya Ott Entry Fixed

రాబోయే రోజులు మొత్తం డిజిటల్ యుగమే. థియేటర్ల కంటే ఓటీటీ లకు ఎక్కువ మార్కెట్ ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు. అందుకే బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎంతో మంది హీరోలు హీరోయిన్స్ ఓటీటీ కంటెంట్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాల్లో కంటే ఓటీటీ కంటెంట్ లో ఎక్కువగా ప్రతిభ చూపించే అవకాశం ఉందంటూ కొందరు స్టార్ హీరోలు హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో విలన్ గా ఆమె కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక ఆహా లో టాక్ షో ను కూడా సమంత చేసింది. ఓటీటీ లో సమంత ఇప్పటికే సందడి చేయగా త్వరలో ఆమె భర్త నాగచైతన్య కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ తో నాగచైతన్య ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తున్న చైతూ ఓటీటీ కి కూడా ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో నాగార్జున కూడా ఓటీటీ కంటెంట్ పై ఆసక్తిగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. త్వరలోనే ఆయన ఓటీటీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తండ్రి కంటే ముందే నాగచైతన్య తన ఓటీటీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ తో ఇప్పటికే నాగచైతన్య ఒప్పందం జరిగిందని అంటున్నారు. అయితే అది తెలుగు వెబ్ సిరీస్ అయ్యి ఉంటుందా లేదంటే హిందీ వెబ్ సిరీస్ లో మరో హీరోతో నాగచైతన్య స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే చైతూ ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.