బాలీవుడ్ రీమేక్ చేసే ఛాన్సే లేదు

Mon Nov 18 2019 13:06:02 GMT+0530 (IST)

Naga Chaitanya On about Chhichhore Movie Remake

`మజిలీ` చిత్రంతో డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తూ యమబిజీగా వున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమాతో పాటు మేనమామ వెంకటేష్ తో కలిసి `వెంకీ మామ` చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇవి రెండూ రాకెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండిటిలో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న `వెంకీ మామ` త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇదిలా వుండగా చైతూ ఓ బాలీవుడ్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారమవుతోంది.బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్- శ్రద్ధా కపూర్- వరుణ్ శర్మ- `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ నవీన్ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం `చిచోర్` ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని ఇందులో చైతూ లీడ్ పాత్ర పోషించనున్నారని ప్రచారమైంది. `దంగల్` ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వం వహించిన `చిచోరే` చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషించిన పాత్ర కోసం అల్లు అరవింద్ హీరో నాగచైతన్య ని సంప్రదిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. అంతేకాదు చైతన్యకు ఇది పర్ఫెక్ట్ గా సూటయ్యే సినిమా అంటూ విశ్లేషించారు.

అయితే ఇది నిజమా?   చైతూ బాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్నారా? అంటే అందుకు అవకాశం లేదని చైతూనే స్వయంగా ఖండించారట. అసలు తనకు ఇప్పట్లో రీమేక్ సినిమాలో నటించే ఆలోచనే లేదని ఖరాకండిగా తేల్చి చెప్పేశారట. తన సన్నిహితులు చిచోరేర రీమేక్ వార్తను చెవిన వేయడంతో చైతూ అనాసక్తిని కనబరిచారట. పైగా అతడు మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి  ఓ క్లాసిక్ ఫ్యామిలీ సినిమాలో చేయాలని అనుకుంటున్నాడు. వరుసగా మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి. అందుకే రీమేక్ కి అంగీకరించేంత టైమ్ లేదట.