Begin typing your search above and press return to search.

స‌రిగ్గా సెట్ రైట్ అయిన అక్కినేని హీరో

By:  Tupaki Desk   |   15 Dec 2019 5:54 AM GMT
స‌రిగ్గా సెట్ రైట్ అయిన అక్కినేని హీరో
X
నేల విడిచి సాము చేస్తే ఎలా ఉంటుందో ప‌క్కాగా అర్థ‌మైంది అక్కినేని బుల్లోడు నాగ‌చైత‌న్య‌కు. అందుకే ఇప్పుడు రూటు మార్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో అత‌డి ఎంపిక‌లే అందుకు నిద‌ర్శ‌నం. మ‌జిలీ లాంటి క్లాసిక్ హిట్ త‌ర్వాత చైతూలో ఎమోష‌న‌ల్ క్వాంటిటీ పెరిగింది. వెంకీమామతోనూ మ‌రోసారి జ‌నాల‌కు న‌చ్చాడు కాబ‌ట్టి అత‌డి థింకింగ్ లో మెచ్యూరిటీ కూడా క‌నిపిస్తోంది.

త‌న‌కు ఏమాత్రం సూట్ కాని మాస్ ఇమేజ్ కోసం పాకులాడి ఎడా పెడా దెబ్బ‌లు తిన్న చైత‌న్య‌లో ఇప్ప‌టికి ప‌ర్ఫెక్ట్ క్యాలిక్యులేష‌న్.. ఎగ్జాక్ట్ ప్రిప‌రేష‌న్ క‌నిపిస్తోంది. ఇది మెచ్చుకోద‌గ్గ ప‌రిణామ‌మే. నాగ‌చైత‌న్య శ‌రీర‌భాష‌కు ఏది సూట‌వుతుందో అర్థం చేసుకుని తెలివిగా అడుగులు వేస్తున్నాడ‌ని చెప్పొచ్చు. ఇక త‌న ముఖ క‌వ‌లిక‌లు .. శ‌రీరాకృతికి .. క‌ద‌లిక‌ల‌కు త‌గ్గ క‌థ‌ల్ని ఎంచుకుని ముందుకు వెళుతుండ‌డం అభిమానుల్లో స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది.

మాస్ లో మాసివ్ హిట్స్ కొట్టాల‌న్న త‌ప‌న కంటే ఫ్యామిలీ ఆడియెన్ ని మెప్పిస్తూ త‌న‌లోని ల‌వ‌ర్ బోయ్ ని బ‌య‌ట‌కు తీస్తూ తెలివిగా వెళుతున్నాడు. ఇప్ప‌టికిప్పుడు ఇద్ద‌రు సెన్సిటివ్ ద‌ర్శ‌కుల‌కు లైన్ క్లియ‌ర్ చేసిన చైత‌న్య ప్లానింగ్ చూస్తుంటే ప‌ర్ఫెక్ట్ గా సెట్ రైట్ అయ్యాడ‌ని అర్థ‌మ‌వుతోంది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరి అనే చిత్రంలో న‌టిస్తున్న నాగ‌చైత‌న్య గీత గోవిందం ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ కి లైన్ క్లియ‌ర్ చేశాడు. ప‌ర‌శురామ్ చైతూ బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ సెన్సిటివ్ స్టోరీతోనే సెట్స్ కి వెళ్ల‌నున్నాడు. ఇక శేఖ‌ర్ క‌మ్ముల చైతన్య‌ను నైజాం రూర‌ల్ కుర్రాడిగా పూర్తి ప్ర‌యోగాత్మ‌కంగా కొత్త‌గా చూపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చైతూ ప‌ర్ఫెక్ట్ సెటిల్డ్ హీరోగా ఆలోచిస్తున్నాడ‌ని భావించ‌వ‌చ్చు. అలా కాకుండా మాఫియా క‌థ‌లు.. వారియ‌ర్ క‌థ‌లు.. మాస్ ఎన‌ర్జిటిక్ మ్యాసివ్ క‌థ‌లు అంటూ రూటు మారిస్తే త‌న శ‌రీర‌భాష‌కు సూట‌య్యే అవ‌కాశం లేదు. ఇప్ప‌టికి ఇలా కానిచ్చేస్తే సీనియారిటీ వ‌చ్చే కొద్దీ ఇంకా ఇంకా ప్ర‌యోగాల‌కు ఛాన్సుంటుందేమో!!