చైతు కెరీర్లో మొదటిసారిగా ఆ ఘనత!

Mon Apr 15 2019 17:25:05 GMT+0530 (IST)

Naga Chaitanya Majili Movie Enters in 50 Crores Club

అక్కినేని నాగ చైతన్య కెరీర్లో 'మజిలీ' ఒక మెమొరబుల్ ఫిలిం లాగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.  వరస ఫ్లాపుల తర్వాత హిట్ రావడం ఒక ఎత్తైతే ఈ సినిమాలో చైతు నటనకు ప్రశంసలు లభించడం మరో ఎత్తు.  పెళ్ళి తర్వాత చై-సామ్ లో కలిసి నటించడంతో అది కూడా మరో స్పెషాలిటి. వీటికి తోడుగా ఈ సినిమా మరో ఘనత కూడా సాధించింది.నాగచైతన్య కెరీర్లో మొదటిసారి రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్కు దాటిన చిత్రంగా 'మజిలీ' ఇప్పుడు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది.  ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ. 22 కోట్లకు అమ్మగా ఎప్పుడో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసింది.  'మజిలీ' ఇప్పటివరకూ దాదాపు 29 కోట్ల రూపాయల షేర్ సాధించి చైతు కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.  ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తూ ఉండడంతో ముప్పై కోట్ల షేర్ క్లబ్ లోకి చేరడం కూడా లాంఛనమేనని అంటున్నారు.  సినిమా ఘన విజయం సాధించడంతో నిర్మాతలు రేపు సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారట.

'మజిలీ' చైతుకు మాత్రమే సక్సెస్ తీసుకురాలేదు.. టాలీవుడ్ సమ్మర్ సీజన్ ను సూపర్ గా ప్రారంభించింది. ఈ సినిమాలో సమంతాతో పాటుగా దివ్యాన్ష కౌశిక్ కూడా హీరోయిన్ గా నటించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి.. హరీష్ పెద్ది నిర్మించారు.