నాకు ప్రశంసలు వస్తే అందులో సగం ఆమెకే చెందాలి : చైతూ

Thu Sep 16 2021 15:00:52 GMT+0530 (IST)

Naga Chaitanya About Sai pallavi Dance

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న లవ్ స్టోరీ చిత్రం మరో వారం రోజుల్లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. వినాయక చవితి సందర్బంగా విడుదల చేయాలనుకున్నా కూడా థియేటర్ల వద్ద పరిస్థితి ఇంకా పూర్తిగా కుదురుకోలేదనే ఉద్దేశ్యంతో వాయిదా వేయడం జరిగింది. సీటీమార్ సినిమా కు వచ్చిన వసూళ్ల నేపథ్యంలో తప్పకుండా లవ్ స్టోరీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో మేకర్స్ వచ్చే వారం విడుదలకు ఫిక్స్ చేశారు. గత ఏడాది నుండి ఊరిస్తూ వస్తున్న లవ్ స్టోరీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సినిమా లో నాగచైతన్య మరియు సాయి పల్లవిల మద్య లవ్ కమ్ రొమాన్స్ కు అభిమానులు ఖచ్చితంగా ఫిదా అవ్వడం ఖాయం అని.. వారి ప్రేమ చాలా సహజంగా ఉంటుందని ట్రైలర్ మరియు టీజర్ లను చూస్తుంటే అర్థం అవుతోంది.డాన్స్ ప్రధానంగా సాగే ఈ సినిమా లో సాయి పల్లవి డాన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ సాయి పల్లవితో పాటు పలు విషయాల గురించి స్పందించాడు. తనకు కెరీర్ లో లవ్ స్టోరీ ఒక మంచి సినిమా గా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. లవ్ స్టోరీ ఒక రెగ్యులర్ ప్రేమ కథ కాదు. ఇది ఎన్నో ఎమోషన్స్ ను మరియు అనేక సస్పెన్స్ లను థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుందని చైతూ సినిమాపై అంచనాలు పెంచేలా వ్యాఖ్యలు చేశాడు. లవ్ స్టోరీలో శేఖర్ కమ్ముల చూపించిన పాయింట్ అందరిని ఆలోచింపజేస్తుంది అంటూ కూడా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.

లవ్ స్టోరీ గురించి చైతూ ఇంకా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం వల్ల నటుడిగా నాకు మరింత అనుభవం దక్కిందని అన్నాడు. సాయి పల్లవి తో డాన్స్ విషయమై స్పందిస్తూ ఆమె ఖచ్చితంగా బెస్ట్ డాన్సర్. ఆమెతో నేను వేసేందుకు ప్రయత్నించాను. నా డాన్స్ కు ఏమైనా ప్రశంసలు వస్తే ఖచ్చితంగా అందులో సగం సాయి పల్లవికి దక్కుతాయని.. ఆమెతో కలిసి నేను డాన్స్ చేసేందుకు ప్రయత్నించాను అంటూ చైతూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వకు చైతూ ఎక్కువగా గొప్ప స్టెప్పులు వేసింది లేదు. కాని ఈ సినిమాలో సాయి పల్లవి కారణంగా కాస్త కష్టమైన స్టెప్పులనే వేసినట్లుగా ట్రైలర్ మరియు టీజర్ తో పాటు పాటలను చూస్తుంటే అర్థం అవుతోంది. చైతూ తో సాయి పల్లవి డాన్స్ చేయించినందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల మరియు సాయి పల్లవి కాంబో అవ్వడం వల్ల లవ్ స్టోరీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి అంచనాలను అందుకుంటారా అనేది చూడాలి.