Begin typing your search above and press return to search.

నాగ‌చైత‌న్య 20వ సినిమా ఎట్ట‌కేల‌కు

By:  Tupaki Desk   |   14 Dec 2019 8:09 AM GMT
నాగ‌చైత‌న్య 20వ సినిమా ఎట్ట‌కేల‌కు
X
గ‌త కొంత‌ కాలంగా యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ డైల‌మా గురించి తెలిసిందే. మ‌హేష్‌... అఖిల్.... నాగ‌చైత‌న్య అంటూ ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. కానీ ఎవ‌రితోనూ ప్రాజెక్ట్ ఖాయం కాలేదు. గీత గోవిందం చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న త‌ర్వాతా కొత్త‌ ప్రాజెక్టును ప్ర‌క‌టించేందుకు ఏడాది టైమ్ ప‌ట్టిందంటే అర్థం చేసుకోవాలి.

ఎట్ట‌కేల‌కు అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ప‌ర‌శురామ్ #NC20 ప్రాజెక్టును అధికారికంగా ఖాయం చేశారు. ఆ మేర‌కు 14 రీల్స్ ప్ల‌స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ లోగోతో రివీలైన పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ పోస్ట‌ర్ లో నాగ‌చైత‌న్య‌- ప‌ర‌శురామ్ స‌హా 14 రీల్స్ అధినేత‌లు రామ్ ఆచంట‌- గోపిచంద్ ఆచంట ఉన్నారు. అగ్ర హీరోల‌తో కొన్ని భారీ ప్ర‌యోగాల త‌ర్వాత 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ ని స్థాపించి ఈ మిత్ర‌ద్వ‌యం మిడ్ రేంజ్ హీరోల‌తోనూ సినిమాలు తీస్తున్న సంగ‌తి తెలిసిందే.

జోష్ తో కెరీర్ మొద‌లైంది. ఇప్ప‌టికి 18 సినిమాల్లో న‌టించేశాడు. ఈ శుక్ర‌వారం రిలీజైన `వెంకీ మామ` చైత‌న్య కెరీర్ 18వ సినిమా. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `ల‌వ్ స్టోరి` చైతూ కెరీర్ 19వ సినిమా. తొలిసారి తెలంగాణ‌ రూర‌ల్ యాస మాట్లాడే కుర్రాడి గా చై న‌టిస్తున్నాడు. సాయి ప‌ల్ల‌వి ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది. ఈ సినిమా త‌ర్వాత ప‌ర‌శురామ్ తో ఎన్.సి20 సెట్స్ కెళుతుంది.