వెంకీమామను స్టార్ట్ చేసారే!

Wed Jul 11 2018 15:05:46 GMT+0530 (IST)

మొదటిసారి మావయ్య వెంకటేష్ తో కలిసి నాగ చైతన్య నటిస్తున్న వెంకీ మామ(వర్కింగ్ టైటిల్)షూటింగ్ ఈ రోజు హడావిడి లేకుండా మొదలుపెట్టేసారు. విశిష్ట అతిథి ఎవరూ లేకుండానే యూనిట్ మధ్యనే కానిచ్చేశారు. ఇది స్టార్ట్ కావడం గురించి చైతు కొన్ని మీడియా ఛానల్స్ కు   నిన్నా మొన్న ఇంటర్వ్యూలలో హింట్ ఇచ్చినప్పటికీ అది ఈ రోజే అని మాత్రం చెప్పలేదు. మొత్తానికి సెట్స్ పైకి అనుకున్న టైంకే వెళ్తున్నాడు వెంకీ మామ. జై లవకుశ  తర్వాత 8 నెలల గ్యాప్ తీసుకున్న దర్శకుడు బాబీ మధ్యలో పంతం స్క్రీన్ ప్లే కోసం మాత్రమే పని చేసాడు. మిగిలిన సమయం మొత్తం ఈ స్క్రిప్ట్ కోసమే వెచ్చించాడు. కోన వెంకట్ సురేష్ బాబులతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అనే దాని గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ఎఫ్2 అంటూ ఒక మల్టీ స్టారర్ ని లైన్ లో పెట్టేసిన వెంకీ తక్కువ గ్యాప్ లోనే చైతుతో కూడా జాయిన్ అవుతున్నాడు.ప్రచారంలో ఉన్న టైటిల్ ని బట్టి చూస్తే ఇది ఎంటర్ టైనర్ జానర్ లో వస్తున్న మూవీలా అనిపిస్తోంది. నిజ జీవితం తరహాలో ఇందులో కూడా వెంకీ చైతు మామ అల్లుళ్ళ పాత్రలు చేయబోతున్నట్టు సమాచారం. గతంలో ప్రేమమ్ చేసినప్పటికీ అది కేవలం కొద్ది నిమిషాల పాటు ఉండే కాంబో సీన్లు కాబట్టి ఇంకా కావాలని కోరుకున్నారు అభిమానులు. వాళ్ళ కోరికను మన్నించి మొత్తానికి ఇద్దరి కాంబోలో సినిమాకు   త్వరగానే రూట్ క్లియర్ అయ్యింది. దర్శకుడు బాబీకి ఇది నాలుగో సినిమా. పవర్-సర్దార్ గబ్బర్ సింగ్-జై లవకుశ తర్వాత ఇదే అతను చేస్తున్న మూవీ. దగ్గుబాటి అక్కినేని కాంబో మూవీ కాబట్టి అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. వివి వినాయక్ మాత్రమే గెస్ట్ గా కనిపించిన  ఈ ఓపెనింగ్ ఈవెంట్ లో అక్కినేని ఫామిలీ మెంబెర్స్ ఎవరు లేకపోవడం విశేషం.