Begin typing your search above and press return to search.

ఇదే నాగబాబు 'అదిరింది' టీం

By:  Tupaki Desk   |   16 Dec 2019 10:58 AM GMT
ఇదే నాగబాబు అదిరింది టీం
X
సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్‌ కామెడీ షో లో జడ్జ్‌ గా వ్యవహరించిన మెగా బ్రదర్‌ నాగబాబు ఆ షో నుండి తప్పుకున్న విషయం తెల్సిందే. భారీ పారితోషికం కారణంగా జబర్దస్త్‌ నుండి నాగబాబు బయటకు వెళ్లాడు అంటూ ప్రచారం జరుగుతుంది. కారణం ఏంటో కాని ఈటీవీ జబర్దస్త్‌ ను వదిలేసిన నాగబాబు జీ తెలుగులో 'అదిరింది' షో తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అచ్చు జబర్దస్త్‌ కామెడీ షో మాదిరిగానే ఈ కామెడీ షో ఉండబోతుంది.

జబర్దస్త్‌ నుండి ఆది.. సుడిగాలి సుధీర్‌ ఇంకా పలువురు కమెడియన్స్‌ ను నాగబాబు తీసుకు వెళ్లాడు అంటూ ప్రచారం జరిగింది. కాని వారికి జబర్దస్త్‌ నిర్మాణ సంస్థ మల్లెమాల వారితో అగ్రిమెంట్‌ ఉన్న కారణంగా వారు అక్కడే ఉండిపోయారట. అదిరింది కామెడీ షోను ప్రస్తుతానికి జబర్దస్త్‌ పాత కమెడియన్స్‌ అయిన ధన్‌ రాజ్‌.. వేణు.. చమ్మక్‌ చంద్ర.. రచ్చరవి టీమ్స్‌ తో చేయబోతున్నాడు. యాంకర్‌ రవి కూడా ఈ ఫొటోలో ఉన్నాడు. మరి యాంకర్‌ రవి ఒక కమెడియన్‌ గా టీంను లీడ్‌ చేస్తూ ఉంటాడా లేదంటే యాంకర్‌ గా మాత్రమే చేస్తాడా అనేది చూడాలి.

జబర్దస్త్‌ లుక్‌ లో నాగబాబు ఉండగా ఈ అయిదుగురు కూడా చాలా కాన్ఫిడెన్స్‌ గా ప్రేక్షకులతో అదిరింది అనిపిస్తాం అన్నట్లుగా ఈ ఫొటోకు ఫోజ్‌ ఇచ్చారు. జబర్దస్త్‌ లో కీలకం అయిన లేడీ హాట్‌ యాంకర్స్‌ అదిరిందిలో ఉంటారా లేదా అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. అనసూయ మరియు రష్మి గౌతమ్‌ లు జబర్దస్త్‌ కు చాలా కీలకం. అలాంటి యాంకర్‌ అదిరిందికి ఉంటేనే ఏమైనా కిక్‌ అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే అదిరిందికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ప్రతి ఆదివారం ప్రసారం కాబోతున్న అదిరింది కార్యక్రమం ఈనెల 22వ తారీకున ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అదిరిందిపై అందరు ఆసక్తి చూపిస్తున్నారు.. మరి జబర్దస్త్‌ ను మరిపించి అదిరింది అనిపిస్తారా చూడాలి.