మూసుకొని కూర్చోలేం: బాలయ్యకు నాగబాబు వార్నింగ్

Thu May 28 2020 19:58:56 GMT+0530 (IST)

Naga Babu Warns Balakrishna Over His Statements

తెలంగాణ ప్రభుత్వంతో సినీ పెద్దల మీటింగ్ పై టాలీవుడ్ అగ్రహీరో బాలయ్య తాజాగా నిప్పులు చెరిగిన విషయం దుమారం రేపింది. వైరల్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సమావేశాన్ని రియల్ ఎస్టేట్ మీటింగ్ అంటూ నందమూరి బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాలను కుదుపేశాయి.తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు సీరియస్ గా స్పందించారు. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. బాలక్రిష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోాలని.. నోటికి ఎంతవస్తే అంత మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

బాలయ్య మాట్లాడింది చాలా తప్పు అని.. బూతులు కూడా మాట్లాడితే వీడియోలో బీప్ వేశారని.. బాలయ్య కేవలం సినీ పరిశ్రమనే కాదని.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించాడని నాగబాబు నిప్పులు చెరిగారు.

భూములు పంచుకుంటున్నారన్న వ్యాఖ్యలు బాధాకరణమని.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు బాలయ్య క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో.. ఏపీకి వెళ్తే తెలుస్తుందని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏపీని సర్వనాశనం చేసింది మీ టీడీపీ వాళ్లేనని నాగబాబు ఆడిపోసుకున్నారు. బాలక్రిష్ణ ఏం మాట్లాడిన నోరు మూసుకొని కూర్చోమని.. ఇండస్ట్రీకి బాలయ్య కింగ్ కాదని.. కేవలం హీరోనే అని ఆయన గుర్తు చేశారు.

లాక్ డౌన్ కారణంగా చితికిపోతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ కదిలివచ్చిందని నాగబాబు గుర్తు చేశారు. దీనిపై కలిసి రావాల్సింది పోయి విమర్శిస్తావా అంటూ బాలయ్యపై నిప్పులు చెరిగారు.