Begin typing your search above and press return to search.

మెగాస్టార్ అప్పుడలా ఇప్పుడిలా వ్యవహరిస్తున్నారా...?

By:  Tupaki Desk   |   30 May 2020 5:15 AM GMT
మెగాస్టార్ అప్పుడలా ఇప్పుడిలా వ్యవహరిస్తున్నారా...?
X
మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకు టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఓ బ్రాండ్ ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు స్టార్ హీరోలుగా సినీ పరిశ్రమను శాసిస్తున్న సమయంలో తన వైవిధ్యమైన టాలెంట్ చూపించి.. స్వయంకృషితో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. నటన, డాన్స్, ఫైటింగ్ లో తాను చూపిన ప్రత్యేకతకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకు తగ్గట్టుగా 'సుప్రీం హీరో' 'మెగాస్టార్' లాంటి పేర్లతో చిరంజీవిని తమ గుండెల్లో పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉండగా ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించిన దాసరి నారాయణ మరణం తర్వాత ఇండస్ట్రీలో ముఖ్యమైన విషయాలలో మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. ఇండస్ట్రీ సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కరానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. ఈ మధ్య ఇండస్ట్రీలో క్రైసిస్ వలన ఇబ్బందులు పడుతున్న సినీ కళాకారులను కార్మికులను ఆదుకోడానికి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేసి ముందుండి నడిపిస్తూ వస్తున్నాడు. ఇటీవల ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల వలన నష్టపోయిన టాలీవుడ్ ని ఆదుకోమని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడుతూ పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నాడు. ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులతో మీటింగులు ఏర్పాటు చేసి.. ఆ తర్వాత తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి షూటింగులకు అనుమతి లభించడానికి తన వంతు ప్రయత్నం చేసాడు.

కాగా మెగాస్టార్ చిరంజీవి ఇంతకముందు 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) డైరీ ఆవిష్కరణ మీటింగ్ కి హాజరయ్యారు. ఆ మీటింగ్ లో 'మా' ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ అసహనానికి గురయ్యి తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ఆ సందర్భంగా చిరంజీవి - రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ మాటలకు తీవ్ర అసహనానికి గురైన చిరు.. ''మంచి అయితే మైకులో చెప్పండి. చెడు అయితే చెవిలో చెప్పండి'' అని హెచ్చరించారు. ఇలా ఒకరిపై ఒకరు కోపతాపాలతో ఈ వివాదం కాస్తా రాజశేఖర్ రాజీనామా దాకా వెళ్ళింది. 'మా' సమావేశంలో హీరో రాజశేఖర్ వ్యవహరించిన తీరుపట్ల చిరంజీవి అభ్యంతరం చెప్పడం.. స్పందించిన విధానం గమనిస్తే తెలుగు పరిశ్రమ ఐక్యతకు స్వర్గీయ దాసరి నారాయణ రావు అనుసరించిన విధానాలను చిరంజీవి అనుసరించబోతున్నారా అని అనుకున్నారు. ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారంటూ అందరూ ప్రశంసించారు.

అయితే అప్పుడు అలా వ్యవహరించిన చిరంజీవి ఇప్పుడు తమ్ముడు నాగబాబు విషయంలో మాత్రం సైలెంటుగా ఉంటున్నాడంటూ ఇండస్ట్రీలోని కొన్ని వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడి వివాదాన్ని పెద్దది చేశారనేది వారి వాదన. 'మా' వివాదం అప్పుడు రాజశేఖర్ పట్ల అలా వ్యవహరించిన చిరంజీవి నాగబాబు ని మాత్రం ఎందుకు హెచ్చరించడం లేదని వారు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. బాలయ్య లాంటి స్టార్ హీరో అసహనానికి గురైనప్పుడు ఎందుకు అలా మాట్లాడాడో తెలుసుకోకుండా నాగబాబు వేలు చూపిస్తూ నువ్వు కింగ్ వేమీ కాదు జస్ట్ హీరో వి మాత్రమే అనడం ఎంత వరకు కరెక్ట్ అని ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు అడుగుతున్నారు. ఇప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి కల్పించుకొని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని వారు కోరుకుంటున్నారు.