నాగబాబుని కేర్ చేయని బాలయ్య ఫ్యాన్స్...!

Fri May 29 2020 09:45:17 GMT+0530 (IST)

Naga Babu Comments on Balakrishna

టాలీవుడ్ సినీ పెద్దలు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. టాలీవుడ్ కి సంబంధించి ప్రభుత్వంతో జరుగుతున్న ఏ మీటింగ్ కి తనకు ఆహ్వానం లేదన్న బాలకృష్ణ.. తలసానితో కలిసి అందరూ హైదరాబాద్ భూములు పంచుకుంటున్నారా అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు. బాలయ్య నోటిని అదుపులో పెట్టుకోవాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ''భూములు పంచుకుంటున్నారంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఇండస్ట్రీ మంచి కోసమే మంత్రితో సమావేశం అయ్యారు. భూములు పంచుకోవడానికి కాదు. సీనియర్ నటుడైన బాలకృష్ణ ఇలా అర్థంలేని విధంగా మాట్లాడం సరికాదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయనేది ఏపీకి వెళ్తే తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీనే కాకుండా తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా బాలయ్య అవమానించారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి'' అని ఘాటు వ్యాఖ్యలతో బాలయ్యపై విరుకుపడ్డారు.అయితే ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నందమూరి - మెగా ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయింది. వారిది తప్పంటే వారిది తప్పంటూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం నాగబాబు ని చాలా లైట్ తీసుకుంటున్నారు. నందమూరి వారసుడికి కౌంటర్ ఇచ్చేంత సీన్ మెగా బ్రదర్ నాగబాబుకి లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఐనా బాలకృష్ణ ఇండైరెక్ట్ గా కామెంట్ చేసింది చిరంజీవి నాగార్జున మరియు తెరాసా ప్రభుత్వాలనని అర్థం అవుతోంది.. మధ్యలో నాగబాబు ప్రమేయం ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. గాడ్సే దేశ భక్తుడని తెలిసిన నాగబాబుకు ఇండస్ట్రీలో జరిగే సీక్రెట్ వ్యవహారాలు తెలియవా.. బాలయ్య వాటినే కదా ప్రశ్నించాడు.. దాంట్లో తప్పేముంది అంటూ నాగబాబు పై ఫైర్ అవుతున్నారు. రోజుకొక వివాదాస్పద ట్వీట్ తో వీడియోతో అట్టెన్షన్ కోరుకొనే నాగబాబుకి బాలయ్యని క్షమాపణలు కోరే అంత సీన్ లేదని.. చిరంజీవి నీడలో బ్రతుకుతున్న మెగా బ్రదర్ ఇప్పటి నుండైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో బాలయ్య - నాగబాబు వ్యాఖ్యలు ఎక్కడి దాకా దారి తీస్తాయో చూడాలి.