Begin typing your search above and press return to search.

ఊహకందని విధంగా ‘సైరా’ ఉంటుందట!

By:  Tupaki Desk   |   10 Dec 2018 2:30 PM GMT
ఊహకందని విధంగా ‘సైరా’ ఉంటుందట!
X
నాగబాబు తాజాగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. ప్రస్తుతం నాగబాబు ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నాగబాబు మాట్లాడిన పలు విషయాలు వేరు వేరుగా సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక అదే ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ సైరా చిత్రంతో పాటు రామ్‌ చరణ్‌ గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు.

సైరా గురించి నాగబాబు మాట్లాడుతూ... అన్నయ్య సైరా చిత్రంలో బటుడి పాత్ర వచ్చినా కూడా నటించేందుకు సిద్దంగా ఉన్నాను. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించిన పూర్తి విషయాలు ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా నాగబాబు పేర్కొన్నాడు. ఈ చిత్రం గురించి తనకు సురేందర్‌ బాబు చెప్పిన దాని ప్రకారం ప్రేక్షకులు ఊహకు కూడా అందని విధంగా సైరా ఉండబోతుందని నాగబాబు పేర్కొన్నారు. అన్నయ్య క్రేజ్‌ ఏమాత్రం చెక్కు చెదర్లేదని 150వ చిత్రం ఖైదీ నెం.150తో వెళ్లడయ్యిందని ఈ సందర్బంగా నాగబాబు చెప్పుకొచ్చాడు.

రామ్‌ చరణ్‌ గురించి మాట్లాడుతూ.. నిర్మాతగా ఇప్పటికే చరణ్‌ బెస్ట్‌ అనిపించుకున్నాడు. చరణ్‌ లో అన్నయ్య జీన్స్‌ తో పాటు మేనమామ అల్లు అరవింద్‌ గారి జీన్స్‌ కూడా ఉన్నాయి. అందుకే చరణ్‌ గొప్ప నిర్మాతగా పేరు తెచ్చుకుంటాడని నాగబాబు అన్నాడు. వ్యాపారంకు సంబంధించిన తెలివి తేటలు చరణ్‌ లో బాగా ఉన్నాయని కితాబిచ్చాడు.