Begin typing your search above and press return to search.

నాగ్ తో ప్ర‌వీణ్ స‌త్తారు మూవీ ఆగిపోలేదు

By:  Tupaki Desk   |   16 May 2021 8:30 AM GMT
నాగ్ తో ప్ర‌వీణ్ స‌త్తారు మూవీ ఆగిపోలేదు
X
కింగ్ నాగార్జున న‌టించిన వైల్డ్ డాగ్ క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నా సెకండ్ వేవ్ ప్ర‌భావంతో థియేట‌ర్ల నుంచి ఆశించిన వ‌సూళ్ల‌ను సాధించ‌లేక‌పోయింది. ఆ క్ర‌మంలోనే కేవ‌లం 21రోజుల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేయ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక మంచి చిత్రానికి క‌రోనా తీవ్ర న‌ష్టాల‌ను క‌ల‌గ‌జేసింద‌ని ట్రేడ్ ఆవేద‌న చెందింది.

అదంతా అటుంచితే.. ఈ సినిమా త‌ర్వాత నాగార్జున న‌టించే సినిమా క్యాన్సిల్ అయ్యింద‌ని ప్ర‌చార‌మైంది. కానీ దానిని ప్ర‌వీణ్ స‌త్తారు టీమ్ ఖండించింది. ఆయ‌న‌ ద‌ర్శ‌క‌త్వంలోని ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ప్ర‌క‌టించాల్సి ఉండ‌గా.. ఇది సృజ‌నాత్మ‌క విభేధాల‌తో ఆగిపోయింద‌ని ప్ర‌చార‌మైంది.

నిజానికి అవ‌న్నీ కేవ‌లం రూమ‌ర్స్ మాత్ర‌మేన‌ని తాజాగా తెలిసింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ జూన్ మొదటి వారం నుండి ప్రారంభమవుతుందని చిత్ర‌బృందం పేర్కొంది. సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎలా ఉన్నా.. దేనికీ వెరువ‌ని హీరోగా మ‌రోసారి నాగార్జున డేర్ చ‌ర్చ‌కు రానుంది. ఇప్ప‌టికే ప‌లు తెలుగు సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు ఆగిపోయాయి. కానీ నాగార్జున ఆపే ఆలోచ‌న‌లో లేరు. ఆయ‌న రెండు డోసుల వ్యాక్సినేష‌న్ తో సుర‌క్షితంగానే ఉన్నారు. ఇక గతంలో మొద‌టి వేవ్ స‌మ‌యంలోనూ వ్యాక్సినేష‌న్ పూర్త‌వ్వ‌క ముందే.. ఎంతో ధైర్యంగా వైల్డ్ డాగ్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్న నాగ్ ఇప్పుడు సెకండ్ వేవ్ లోనూ త‌న షూటింగును ఆప‌కుండా కొన‌సాగించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ప్ర‌వీణ్ స‌త్తారు- నాగార్జున బృందం త‌దుప‌రి షెడ్యూల్ కోసం లండన్ వెళ‌తార‌ని తెలిసింది. ఇక ఈ చిత్రంలో సిస్ట‌ర్ సెంటిమెంట్ హైలైట్ గా ఉండ‌నుందిట‌. నాగ్ సోద‌రిగా గుల్ ప‌నాగ్ న‌టిస్తుండ‌గా.. కాజల్ అగర్వాల్ కథానాయికగా న‌టిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్- రామ్ మోహన్ రావు- శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్తార‌ని తెలిసింది. ఇక ప్ర‌స్తుత కోవిడ్ స‌న్నివేశంలో షెడ్యూల్ ప్లానింగ్ ఎలా ముందుకెళుతుందో చూడాలి