లిరికల్ సాంగ్: నచ్చావబ్బాయ్ పిచ్చి పిచ్చిగా...!

Sun Aug 14 2022 11:15:28 GMT+0530 (IST)

Nachav Abbai Lyrical Song From Nenu Meeku Baga Kavalsina Vadini Movie

``నచ్చావబ్బాయ్ పిచ్చి పిచ్చిగా...! పోన్లే అమ్మాయ్ ఇన్నాళ్లకి మంచి మంచి మాటే చెప్పావమ్మాయ్..!`` లిరిక్ లో జోష్ ఉందా లేదా? అనేది చెప్పేందుకు ఈ రెండు లైన్లు చాలు. లిరిక్ కి తగ్గట్టే పాటలో జోష్ నాయకానాయికల డ్యాన్సులు ఎనర్జీ ప్రతిదీ ఆకట్టుకున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ తనదైన బాణీతో యూత్ ని ఆకట్టుకున్నారు.కిరణ్ అబ్బవరం- సంజన ఆనంద్ జంటగా కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా నుంచి పాట ఇది.
`నేను మీకు బాగా కావాల్సిన వాడిని` అనేది టైటిల్. శ్రీధర్ గాదే దర్శకుడు. ఈ శీర్షికకు తగ్గట్టే టీజర్ లో కంటెంట్ ఆకట్టుకుంది. ఇప్పుడు పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఆద్యంతం పుష్కలమైన ఎంటర్ టైన్ మెంట్ తో  ఆకట్టుకోనుందని విజువల్స్ చెబుతున్నాయి. తాజాగా విడుదలైన నచ్చావబ్బాయ్.. సాంగ్ థీమ్ యూత్ ఫుల్ గా అలరించింది.

కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే కొరియోగ్రఫీ కుదిరింది. ఈ మూవీలో ఫన్ .. చతురత.. పెర్ఫామెన్సెస్ తో పాటు మణిశర్మ మ్యూజిక్ ప్రధాన అస్సెట్ గా కనిపించనున్నాయి.  ``యావరేజ్ గా ఉన్న అమ్మాయిల విలువ నాలా  కరువులో ఉన్నోడికి తెలుస్తుంది కానీ.. నీలా కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది? .`` లాంటి పంచ్ డైలాగ్ తో ఈ మూవీ కంటెంట్ యూత్ ఫుల్ అని టీమ్ చెప్పకనే చెప్పింది.

కిరణ్ అబ్బవరం- సంజన ఆనంద్- సిధ్ధార్ద్ మీనన్- ఎస్వి కృష్ణారెడ్డి- బాబా బాస్కర్- సమీర్- సంగీత- నిహరిక- ప్రమోదిని తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. భాస్కర్ భట్ల లిరిక్స్ ని అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. రాజావారు రాణిగారు- ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన కిరణ్ ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. లెజెండ్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఎంటర్ టైనర్స్ స్ఫూర్తితో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనుందో వేచి చూడాలి.