జూ.ఇలియానా మరో జాక్ పాట్

Wed Nov 20 2019 09:50:45 GMT+0530 (IST)

Nabha Natesh To Patch Up With Sai Dharam Tej

సైలెంటుగా దూసుకొచ్చి టాలీవుడ్ లో టాప్ రేంజుకు ఎదిగేస్తోంది కన్నడ శివంగి నభా నటేష్. సుధీర్ బాబు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు లేటెస్టుగా `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో బంపర్ హిట్టు కొట్టింది. సుధీర్.. రామ్ ఇద్దరికీ లక్కీ ఛామ్ గా పేరు తెచ్చుకుంది. ఇక గోవా బ్యూటీ ఇలియానా లేని లోటు తీరుస్తోందని తెగ పొగడ్తలు కురుస్తున్నాయి ఈ భామపై. అభిమానులు అయితే జూనియర్ ఇలియానా అని పిలిచేసుకుంటూ తెగ మురిసిపోతున్నారు.ఆ పిలుపునకు తగ్గట్టే ఈ అమ్మడు ఆ లోటు తెలియనివ్వకుండా ఎంతో వైబ్రేంట్ గా కనిపిస్తోంది. మాస్ అప్పీల్ లో నభాని కొట్టేవాళ్లే లేరని నిరూపణ అయ్యింది. గ్లామర్ ఎలివేషన్ .. ఎక్స్ పోజింగులో నభా ఏమాత్రం మొహమాటపడకుండా యూత్ కి ట్రీటిస్తోంది. అందుకే ఈ అమ్మడికి ఒకదాని వెంట ఒకటిగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ సరసన డిస్కోరాజా చిత్రంలో నటిస్తోంది.  

తాజా సమాచారం ప్రకారం.. మెగా కాంపౌండ్ లోనూ ఈ అమ్మడు అడుగు పెడుతోంది. సుప్రీం హీరో సాయి తేజ్ సరసన ఈ భామ కథానాయికగా ఎంపికైంది.  ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు. నిన్ననే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైందని టీమ్ ప్రకటిస్తూ నభా పేరుని కన్ఫామ్ చేసింది.   సాయి తేజ్ హీరోగా నటిస్తున్న `సోలో బ్రతుకే సో బెటర్` లో ఈ అమ్మడికి ఛాన్స్ దక్కడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇల్లీ లేని లోటు తీరుస్తోంది నభా. ఇక రామ్ లానే ఇస్మార్ట్ హిట్ కొట్టి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న సాయి తేజ్ కి ఈ అమ్మడు లక్కీ ఛామ్ గా మారుతుందేమో చూడాలి. సాయిధరమ్ నటించిన ప్రతిరోజు పండగే ఈ డిసెంబర్ లో రిలీజవుతోంది. ఆ క్రమంలోనే సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాడు సాయి తేజ్.  మే1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది.