ఫొటోటాక్ : నభ నటేష్ ఇస్మార్ట్ గ్లామర్ షో

Tue Aug 03 2021 22:00:01 GMT+0530 (IST)

Nabha Natesh Ismart Glamour Show

మొదటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అందంతో పాటు నటనతో మెప్పించి టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా నిలిచిన ముద్దుగుమ్మ నభ నటేష్. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలకు ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ అనడంలో సందేహం లేదు తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న నభ నటేష్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అందాల వింధు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఈ అమ్మడు భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో ఈమె స్కిన్ సో మరీ బోల్డ్ గా కాకుండా అందంగా ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చీరలో ఈమె లుక్ కు ప్రస్తుతం అంతా కూడా వావ్ అంటున్నారు. నెట్టింట రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉండే నభ నటేష్ మరోసారి ఈ స్టిల్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ స్టిల్స్ ను ఫిల్మ్ మేకర్స్ చూస్తే ఖచ్చితంగా వావ్ అంటూ సినిమాల్లో ఆఫర్ తో ఆమె గడప తొక్కడ ఖాయం అన్నట్లుగా స్టిల్స్ ఉన్నాయి. చీర కట్టులో ఇంత అందంగా సెక్సీగా చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ఈమెకు అవకాశం దక్కింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం నభ నటేష్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. నితిన్ తో ఈమె నటించిన మాస్ట్రో సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అది మాత్రమే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో నభ నటించబోతున్న మూడు నాలుగు సినిమాలు అయినా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. ఇస్మార్ట్ సక్సెస్ తో మంచి ఫామ్ లోకి రాగానే కరోనా వల్ల సినిమాల షూటింగ్ లు నిలిచి పోయి ఈమె చేతిలోకి వచ్చిన ఆఫర్లు చేజారాయట. మళ్లీ ఇప్పుడిప్పుడే మళ్లీ ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం పలు సినిమాలకు సైన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.