మాస్ట్రో బ్యూటీ నాజూకు సోయగం.. పిక్ వైరల్

Thu Apr 22 2021 21:00:01 GMT+0530 (IST)

Nabha Natesh Latest Photo

టాలీవుడ్ కుర్రభామ నభానటేష్ అంటే తెలుగు కుర్రకారుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సోలో బాయ్స్ అందరికి ఈ సోలో బ్యూటీ డ్రీమ్ గర్ల్ లాంటిది. ఈ పాతికేళ్ల సుందరి కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులో అరంగేట్రం చేసింది. కానీ మెల్లగా తెనుగులోనే సెటిల్ అవుతోంది. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ కెరీర్ ప్రారంభించిన నభా.. మినిమం ఏడాది ఒక సినిమా అయినా రిలీజ్ చేస్తోంది. గతేడాది నుండి ఏకంగా రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తోంది. గతేడాది డిస్కోరాజా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో పలకరించిన చిన్నది.. ఈ ఏడాది ఆల్రెడీ అల్లుడు అదుర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మోస్తరు హిట్ అందుకుంది. ప్రస్తుతం మరో సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.నితిన్ హీరోగా రూపొందుతున్న 'మాస్ట్రో' సినిమాలో నభా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 11న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి హాఫ్ ఇయర్ లోనే రెండు రిలీజ్ చేస్తే ఎండింగ్ వరకు మరోటి ప్లాన్ చేస్తుందేమో అమ్మడు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో నభా క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇటు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటుగా గ్లామరస్ ఫోటోషూట్స్ కూడా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా నభా జిమ్ లో దిగిన లేటెస్ట్ పిక్ షేర్ చేసింది. మొన్నటివరకు బొద్దుగా కనిపించిన నభా.. వర్కౌట్స్ తో కాస్త నాజూకుగా మారేందుకు ట్రై చేస్తోంది. షార్ట్ అండ్ టిషర్ట్ ధరించి అద్దానికేసి చూస్తూ పిక్ దిగింది. కానీ టాప్ టు బాటమ్ చాలా స్టైలిష్ గా పోజిచ్చింది. ప్రస్తుతం ఈ మాస్ట్రో బ్యూటీ సెల్ఫీ నెట్టింట వైరల్ అవుతోంది.