నాటు పిల్ల..ఘాటు గ్లామర్

Sun Feb 21 2021 23:00:01 GMT+0530 (IST)

Nabha Natesh Glamourous Pose

సృష్టికర్త నిజంగా అమ్మాయిల పక్షపాతే .. లేకపోతే అబ్బాయిలను పక్కన పెట్టేసి అమ్మాయిలకు మాత్రమే అందం ఇచ్చేస్తాడా? అమ్మాయిల్లో కూడా మళ్లీ కొంత తేడా చూపించేస్తూ కొంతమందికి కొన్నికిలోల రేషన్ ఎక్కువగానే ఇచ్చేశాడు. అలా అదనంగా అందాన్ని దక్కించుకున్న వాళ్లంతా హీరోయిన్లు అయ్యారు. ఎక్కడ హీరోలు అక్కడ సెట్టయితే వీళ్లు మాత్రం అందంతో అన్ని భాషలను చుట్టబెట్టేస్తున్నారు. అలా అందంతోనే అవకాశాలను .. అభిమానులను సంపాదించుకుంటున్న కథానాయికలలో ఒకరుగా నభా నటేశ్ కనిపిస్తోంది.ముద్దబంతులు .. ముద్దమందారాలు కలిపి చేసినట్టుగా కనిపించే ఈ అమ్మాయికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మాస్ ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టడం ఈ అమ్మడికి అస్సలు ఇష్టం ఉండదు. అందువలన ఎలాంటి మొహమాటాలకు పోకుండా అందాలను ఆరేస్తుంది .. పరువాలను పరిచేస్తుంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో తెరపై భారీ అందాలతో ఈ అమ్మాయి చేసిన అందాల హడావిడికి కుర్రాళ్లు ఇంతవరకూ కోలుకోలేదు. మళ్లీ ఆ పిల్ల చేసిన మరో సినిమా చూపిస్తేనేగానీ మనలోకి వచ్చేలా లేరు. ఈ కారణంగానే ఈ అమ్మాయికి ఒక రేంజ్ లో డిమాండ్ పెరిగింది.

తాజాగా సోషల్ మీడియాలో నభా వదిలిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో కుర్రాళ్లను కలవరపెట్టేస్తోంది. బొండుమల్లెలాంటి ఈ కుర్రది .. విరజాజిలా విరబోసుకుని సోఫాలో అలా వాలిపోయిన తీరును కళ్లప్పగించి చూస్తూ కలర్ ఫొటోగా మార్చేయడానికి ట్రై చేస్తున్నారు. 'అల్లుడు అదుర్స్'లో అందాల సందడి చేసిన ఈ అమ్మాయి 'అంధదూన్' రీమేక్ లో నితిన్ సరసన చేయడానికి సిద్ధమవుతోంది. మరో రెండు ప్రాజెక్టులలో కథానాయికగా ఈ పిల్ల పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే పెద్ద హీరోల సరసన మెరిసే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.