ఫోటో స్టోరీ: అబ్బా.. నభా నువ్వు కూడానా?

Thu Oct 10 2019 17:24:55 GMT+0530 (IST)

Nabha Natesh Glamourous Pose

ఈమధ్య తెలుగు తెరపైకి దూసుకొస్తున్న కొత్త తరం హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు.  కన్నడ సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ 'నన్ను దోచుకుందువటే'  సినిమాతో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది.  'అదుగో' నిరాశపరిచినా ఈమధ్యే రిలీజ్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.  ఈభామకు మోడలింగ్ నేపథ్యం కూడా ఉంది. అందుకే ఫోటోషూట్లతో జనాలను తనవైపు తిప్పుకోవడం వెన్నతో పెట్టిన విద్య.రీసెంట్ గా అలా ఒక ఫోటో షూట్ లో పాల్గొనడం.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడం చకచకా జరిగిపోయాయి. గ్రే కలర్ స్లీవ్ లెస్ టాప్.. లుంగీ డ్యాన్స్ కు ముందు కట్టిన లుంగీ టైప్ లో ఒక బాటమ్ ధరించి వయ్యారంగా పోజిచ్చింది.  పర్ఫెక్ట్ మేకప్.. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. కాస్త కర్లీగా ఉన్న హెయిర్ స్టైల్ తో ఓ మోడల్ లా నిలుచుంది.  అయితే ఈ ఫోటోలో హైలైట్ మాత్రం అవన్నీ కాదు.  అదేంటో కళాపోషకులైన నెటిజన్లకు ఈపాటికి తెలిసిపోయే ఉంటుంది.  అయినా కె. రాఘవేంద్రయిజం లో ఉన్న ఫస్ట్ రూల్ దాన్ని గమనించడమే.. రెండో రూల్ బిగ్ బాస్కెట్లో బత్తాయిలను ఆర్డర్ చెయ్యడం.  మూడో రూల్.. కళాపోషణ తెలియని కుఫ్లీ విమర్శకులు చేసే కఠోరమైన విమర్శలకు రెడీగా ఉండడం. దట్సిట్.. !

అయినా మన పిచ్చి కానీ నభాలోనే నాభి సౌండింగ్ ఉంది. మరి ఆ మాత్రం నెటిజన్లను సతాయించకపోతే ఎలా? అయినా అందరూ అందమైన హీరోయిన్లను బాపుబొమ్మ అంటారు కానీ ఇలాంటి అందాలను మనం ఎందుకు రాఘవేంద్రరావు బొమ్మ అని అనకూడదు? ఇక నభా కొత్త సినిమాల విషయానికి వస్తే 'డిస్కో రాజా' లో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్' లో కూడా హీరోయిన్ ఆఫర్ వచ్చింది.