Begin typing your search above and press return to search.

బ్యాక్‌ టు బ్యాక్‌ షూట్‌ లో ఇస్మార్ట్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   29 Sep 2020 8:50 AM GMT
బ్యాక్‌ టు బ్యాక్‌ షూట్‌ లో ఇస్మార్ట్‌ బ్యూటీ
X
నన్నుదోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ నభా నటేష్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది. లాక్‌ డౌన్‌ అవ్వకుంటే ఇప్పటి ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేవి. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ సోలో బ్రతుకే సోబెటర్‌ మరియు సాయి శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్‌ సినిమాల్లో ఈమె బ్యాక్‌ టు బ్యాక్‌ షూటింగ్ లో పాల్గొంటుంది. మొన్నటి వరకు సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమాలో తేజుకు జోడీగా నటించిన ఈ అమ్మడు తాజాగా అల్లుడు అదుర్స్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యింది.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకోవడంతో పాటు నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె యువ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా ఉంది. ఈమెతో నటించేందుకు పలువురు యంగ్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్‌ హీరోలు కూడా ఈమెకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల తర్వాత ఈమె రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈమె సోలో బ్రతుకే సో బెటర్‌ మూవీ ఓటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్లుడు అదుర్స్‌ మూవీ కూడా రాబోతుంది. బెల్లంకొండ మూవీ ఎలా విడుదల అవ్వబోతుంది అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్‌ లకు సైన్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.