Begin typing your search above and press return to search.

'నా చెలివే' సాంగ్: తన గాత్రంతో మరోసారి మాయ చేసిన సిద్ శ్రీరామ్..!

By:  Tupaki Desk   |   13 Sep 2021 5:02 AM GMT
నా చెలివే సాంగ్: తన గాత్రంతో మరోసారి మాయ చేసిన సిద్ శ్రీరామ్..!
X
ప్రముఖ ర్యాపర్, 'బిగ్ బాస్' ఫేమ్ నోయల్ సీన్ - మెహబూబ్ - సుమీత బజాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''చకోరి''. సత్య ధానేకుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆష్టా సినీ క్రియేషన్స్ బ్యానర్‌ పై దేవు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా 'చకోరి' సినిమా నుంచి ''నా చెలివే'' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. 'నా చెలివే.. రాక్షశివే.. నువ్వెవరే.. ఎక్కడెక్కడో వెతికా నిన్నే.. ఒక్కసారి కూడా కనపడవేమే.. ఎంతకాలమని వేచి ఉండమంటావే.. ఎంతమందినో అడిగా నేనే.. ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే..' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను విశేషంగా అలరిస్తోంది.

'నా చెలివే' పాటకు లీండర్ లీ మార్టీ బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. ప్రముఖ యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ గీతాన్ని ఆలపించారు. తన అద్భుతమైన గాత్రంతో సింగర్ సిద్ మరోసారి మాయ చేసారని చెప్పవచ్చు. లిరిసిస్ట్ చిత్రన్ ఈ పాటకు మంచి సాహిత్యం అందించారు. సినిమాలో ఓ పార్టీలో ఈ సాంగ్ ను నోయల్ సీన్ ఆలపిస్తుండగా.. పక్కనే మెహబూబ్ గిటార్ ప్లేట్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ సుమీత బజాజ్ కూడా కనిపించారు.

'చకోరి' సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన 'నా చెలివే' సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుంది. ప్రేక్షకుల నుంచి పాటిజిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ పాట సినిమాకు ప్లస్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీలం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. క్రాంతి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.