ఎన్టీఆర్30 : అనిరుథ్ కు నాల్గవ ఛాన్స్

Thu May 26 2022 06:00:01 GMT+0530 (IST)

NTR30 Fourth chance for Anirudh

సినిమా ఇండస్ట్రీలో వరుసగా రెండు మూడు ప్లాప్ లు పడితే మళ్లీ కోలుకోవడం కష్టం. కాని అదృష్టం కలిసి వస్తే ఎన్ని ప్లాప్ లు పడ్డా కూడా ఆఫర్లు వస్తూనే ఉంటాయి... ఏదో ఒక సమయంలో సక్సెస్ దక్కుతుంది. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోకుండా కెరీర్ లో దూసుకు పోయిన వారు.. పోతున్న వారు ఒకరు ఇద్దరు ఉన్నారు. అనిరుథ్ రవిచంద్రన్ తెలుగు లో కెరీర్ చాలా కష్టంగా మొదలు పెట్టాడు.తమిళనాట స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న అనిరుథ్ తెలుగు లో అజ్ఞాతవాసి అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా తోనే మళ్లీ కోలుకుంటాడా అన్నంత దారుణమైన పరాజయం పాలయ్యాడు.

అయితే తమిళనాట ఆయన పాటలు.. సినిమాలు సక్సెస్ అవ్వడంతో మళ్లీ జెర్సీ మరియు నాని గ్యాంగ్ లీడర్ సినిమాలకు ఛాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు మూడు సినిమాలను అనిరుథ్ తెలుగు లో చేశాడు.

మూడు సినిమాల్లో అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ అవ్వడంతో పాటు పాటలు కూడా పెద్దగా ఆధరణకు నోచుకోలేదు. ఇక ఆ తర్వాత జెర్సీ మరియు గ్యాంగ్ లీడర్ లు పర్వాలేదు అనిపించుకున్నాయి. పాటలు కూడా బాగానే ఉన్నాయనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాని ఇప్పటి వరకు కమర్షియల్ గా బిగ్ బ్రేక్ అనేది అనిరుథ్ కు దక్కిందే లేదు. దాంతో ఆయన కెరీర్ చాలా అప్స్ అండ్ డౌన్స్ లో సాగుతోంది.

అనిరుథ్ కు తాజాగా ఎన్టీఆర్ 30 ఛాన్స్ దక్కింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కు అనిరుథ్ సంగీతం అందించబోతున్నాడు. తమిళనాట స్టార్ సంగీత దర్శకుడిగా పేరు దక్కించుకున్న అనిరుథ్ తెలుగు లో మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ 30 ఛాన్స్ రావడంతో ఖచ్చితంగా ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

తెలుగు లో ఈ నాల్గవ అవకాశం ను అనిరుథ్ ఉపయోగించుకుంటే తప్పకుండా మంచి ఫ్యూచర్ టాలీవుడ్ లో దక్కినట్లే. ఎన్టీఆర్ 30 కోసం కొరటాల శివ చాలా మాస్ బీట్స్ తో పాటు ఫ్యామిలీస్ ను మెప్పించే బీట్స్ ను కూడా రెడీ చేయాలంటూ ఇప్పటికే అనిరుథ్ కు చెప్పాడట. గతంతో పోల్చితే అనిరుథ్ లోమెచ్యూరిటీ లెవల్స్ పెరిగాయి. కనుక తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తప్పకుండా మంచి పాటలు ఇస్తాడని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. అనిరుథ్ ఈ నాల్గవ ఛాన్స్ తో టాలీవుడ్ లో నలబై సినిమాలు చేస్తాడా... ఈ నాలుగు సినిమాలతో ఆపేస్తాడా అనేది చూడాలి.