Begin typing your search above and press return to search.

బాబాయ్ .. దంచేశావ్: ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   3 Dec 2021 7:37 AM GMT
బాబాయ్ .. దంచేశావ్: ఎన్టీఆర్
X
మొదటి నుంచి కూడా బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఎప్పుడూ తన సినిమా ఏదో ఒకటి సెట్స్ పై ఉండవలసిందే. ఆ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఖుషీ కావలసిందే. తన సినిమా ఎంత గొప్ప హిట్ అయినా, ఎంత పెద్ద ఫ్లాప్ అయినా ఆ విషయాన్ని అదే పనిగా తలచుకుంటూ కూర్చునే అలవాటు ఆయనకి లేదు.

తన పని తాను కరెక్టుగా చేస్తున్నానా లేదా? ఫలితం ఏమిటనేది తరువాత సంగతి అన్నట్టుగానే ఆయన ముందుకు వెళుతుంటారు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అఖండ' హిట్ టాక్ తెచ్చుకుంది.

బాలకృష్ణకి మొదటి నుంచి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. భారీ తనం .. పవర్ఫుల్ డైలాగులు .. శత్రువులను ఆయన సింహంలా వెంటాడటం మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. వాళ్లంతా కూడా ఆయనను ఇంచుమించు ఒక సింహానికి దగ్గరగానే ఊహించుకుంటారు. అందువలన ఆ స్థాయిలో ఆయనను చూపిస్తేనే ఆ కథ వాళ్లకి కనెక్ట్ అవుతుంది.

ఈ విషయాన్ని బాగా గ్రహించిన దర్శకుడు బోయపాటినే. బాలకృష్ణను ఎలా చూపించాలనే విషయంలో ఆయనకి పూర్తి క్లారిటీ ఉంది. అందువల్లనే 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయి.

ఆ సినిమాలకి మించి ఈ సారి చేయబోయే సినిమా ఉండాలని భావించిన బోయపాటి, అలాంటి కథనే తయారుచేసుకుని 'అఖండ'తో రంగంలోకి దిగాడు. నిన్ననే ఈ సినిమా థియేటర్లలోకి దిగిపోయింది. లుక్ పరంగా బాలకృష్ణను కొత్తగా చూపించడంలోను .. మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలను పుష్కలంగా అందించడంలోనూ బోయపాటి సక్సెస్ అయ్యాడు.

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లోని సినిమా ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో, అలాంటి సినిమానే అందించారు. దాంతో ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూవళ్లతో దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో ఎన్టీఆర్ స్పందించాడు. 'అఖండ' సినిమా చూశాను. బాబాయ్ అదరగొట్టేశాడు.

రీ సౌండింగ్ సక్సెస్ ను సాధించిన బాలయ్య బాబాయ్ కి .. మొత్తం టీమ్ కి కంగ్రాట్స్. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి ఈ సినిమాలో చాలానే ఉన్నాయి" అంటూ అఖండ విజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగవచ్చని అంటున్నారు.