Begin typing your search above and press return to search.

ఫ్యామిలీతో టైగ‌ర్ లాంగ్ వెకేష‌న్ ప్లానింగ్ అదేనా?

By:  Tupaki Desk   |   10 Dec 2022 5:50 AM GMT
ఫ్యామిలీతో టైగ‌ర్ లాంగ్ వెకేష‌న్ ప్లానింగ్ అదేనా?
X
యంగ్ టైగ‌ర ఎన్టీఆర్ ల్యాండ్ మార్క్ మూవీ 30వ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త ఏడాదిలోనే మొద‌లు పెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే స్ర్కిప్ట్ కి సంబంధించి అన్ని ర‌కాల పనుల్ని పూర్తి చేసారు.

చ‌ర్చ‌ల ద‌శ‌లో ర‌క‌ర‌కాల సందేహాల నేప‌థ్యంలో ప్రాజెక్ట్ డిలే అయిన‌ప్ప‌టికీ చివ‌రిగా కొర‌టాల క‌థ‌తో తార‌క్ దిల్ ఖుష్ అని తేలిపోయింది. క‌థ విషయంలో ర‌క‌ర‌కాల సందేహాలు బుర్ర‌ని తొలిచేసిన‌ నేప‌థ్యంలో కొర‌టాల‌ని ఇబ్బంది పెట్టినా?..ఫైన‌ల్ గా త‌న‌కు ఏ విధంగా కావాలో అలా సిద్దం చేసుకున్నాడు.

దీంతో స్టోరీ ప‌రంగా ఆలోచించుకోవాల్సిన ప‌నిలేదని రిలాక్స్ మోడ్ లోకి జారుకుంటున్నారు. ప్ర‌శాంతంగా వ‌చ్చే ఏడాది కూల్ గా ప్రారంభించి అంతే కూల్ గా రిలీజ్ చేసుకుందామ‌న్న‌ది తార‌క్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు తార‌క్ మ‌రే టెన్ష‌న్ పెట్టుకోకుండా ఫ్యామిలీతో సైలెంట్ గా అమెరికా వెకేష‌న్ కి చెక్కేసిన‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ ఎయిర్ పోర్టులో భార్య‌..పిల‌ల్ల‌తో తార‌క్ ఉన్న ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెసిందే.

దీంతో తార‌క్ కొన్ని రోజుల పాటు అమెరికాలో కుటుంబంతోనే గ‌డ‌ప‌నున్నార‌ని తెలుస్తోంది. అక్క‌డి బంధువులు ..స్నేహితులు..స‌న్నిహితుల్ని క‌లుసుకుని క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ .. కొత్త ఏడాది వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకుని తిరుగు ప్ర‌యాణం కానున్నాడ‌ని స‌మాచారం. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ త‌ర్వాత తారక్ ఎలాంట్ వెకేష‌న్ కి వెళ్ల‌లేదు. కొర‌టాల ప్రాజెక్ట్ పైనే అవిశ్రామంగా ప‌నిచేసారు.

దీంతొ కొంత ఒత్తిడికి గురికావాల్సి వ‌చ్చింది. అందుకే ఇప్పుడిలా కుటుంబంతో అమెరికా వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇలా లాంగ్ వెకేష‌న్ ప్లాన్ చేయ‌డం కూడా ఇదే తొలిసారి. ఇన్ని రోజుల పాటు ఇంత వ‌ర‌కూ తార‌క్ వెకేష‌న్ కి వెళ్లింది లేదు. ఖాళీ ఉంటే హైద‌రాబాద్ లో కుటుంబంతో గ‌డ‌ప‌డం త‌ప్ప దేశాలు దాట‌డం అన్న‌ది చాలా రేర్.

ఈసారి అందుకు భిన్నంగా ప్లాన్ చేసారు. కొత్త ఏడాదిలో ఇండియాలో అడుగు పెట్టిన నాటి నుంచి షూటింగ్ లో బిజీ కానున్నా ర‌ని స‌మాచారం. టైగ‌ర్ 30 తో పాటు ప్ర‌శాంత్ నీల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలి. కొర‌టాల సినిమా సెట్స్ లో ఉండ‌గానే ప్ర‌శాంత్ సినిమా ప‌నుల్లోనే తార‌క్ బిజీ కానున్నాడ‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.