నాలుగు రోజుల్లో ఉత్కంఠకు తెరదించేస్తారట

Mon May 16 2022 23:00:01 GMT+0530 (IST)

NTR movie updates on NTR birthday

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రెండేళ్ల విరామం తరువాత చిరు చేసిన సినిమా అని ఫ్యాన్స్ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చారు. అయితే వారి అంచనాల్ని తలకిందులు చేసి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. దీంతో ఈ మూవీ తరువాత ఆయన చేయనున్న సినిమాపై అభిమానుల్లో పెద్దగా చర్చ జరగడం లేదు.ఈ మూవీ తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ ...నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కినేని ఈ మూవీని నిర్మించబోతున్నారు. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇప్పటికే ఓ వార్త నెట్టింట సందడి చేస్తోంది.

ఇదిలా వుంటే ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే జరగబోతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ - కొరటాల మూవీతో పాటు ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ ల సినిమాకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ని ప్రకటించనున్నారట.  

ఎన్టీఆర్ పుట్టిన రోజు మరో నాలుగు రోజులే వుండటంతో దర్శకుడు కొరటాల శివ  `ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి ఫ్యాన్స్ కి పక్కా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారట. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ అప్ డేట్ కోసం ఆసక్తిని చూపించడం లేదట. `కేజీఎఫ్ ` ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం మాత్రమే ఎదురు చేస్తున్నారట. `కేజీఎఫ్ 2`తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా ప్రకటించి చాలా రోజులవుతోంది. కనీసం ఈ పుట్టిన రోజున అయినా ఈ ప్రాజెక్ట్ పై అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. `కేజీఎఫ్ 3`కి మరింత టైమ్ పడుతుందని మేకర్స్ వెల్లడించిన నేపథ్యంలో దానికి ముందే ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ ని ఏ విధంగా ప్రజెంట్ చేయబోతున్నాడో చిన్న అప్ డేట్ ఇస్తే చాలాని ఫ్యాన్స్ భావిస్తున్నారట.

ఇదిలా వుంటే స్క్రిప్ట్ వర్క్ ని పక్కగా పూర్తి చేసిన కొరటాల శివ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసే పనిలో వున్నారట. అంతే కాకుండా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి ప్రతీదీ విభిన్నంగా ప్లాన్ చేస్తూ సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కారణం యూనివర్సల్ సబ్జెక్ట్ కావడం వల్లే డే వన్ నుంచి ప్రతీ విషయాన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారట. మరి మే 20న కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానుల్ని ఏ మేరకు సర్ ప్రైజ్ చేస్తారో వేచి చూడాలని ఇన్ సైడ్ టాక్.