ప్రశాంత్ నీల్ నిర్ణయంతో ఉసూరుమంటున్న ఎన్టీఆర్ అభిమానులు

Sat Dec 05 2020 15:52:14 GMT+0530 (IST)

NTR fans not happy with Prashant Neil's decision

ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ ల కాంబోలో ఒక సినిమా రాబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కాని అనూహ్యంగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. సలార్ అంటూ టైటిల్ ను కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఉసూరుమంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ వస్తుందని అంతా ఆశ పడ్డారు. కాని ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా ప్రభాస్ తో అవ్వడం వల్ల ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా కోసం మరో దర్శకుడిని చూసుకోవాల్సి ఉంది.



ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ మార్చి తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశించడం లేదు. త్రివిక్రమ్ తెలుగులో సెన్షేషనల్ సక్సెస్ అయితే ఇవ్వగలడు. కాని పాన్ ఇండియా రేంజ్ మూవీని అయితే ఇవ్వడం అనుమానమే అన్న ఆలోచనలో వారు ఉన్నారు.

ఈ సమయంలోనే ఎన్టీఆర్ కోసం మరే దర్శకుడు అయినా పాన్ ఇండియ స్క్రిప్ట్ ను తీసుకు వస్తే బాగుండు అన్నట్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చే క్రేజ్ ను కంటిన్యూ చేయగల సత్తా ప్రశాంత్ నీల్ కు ఉంది. కాని ఆయన తో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు పాన్ ఇండియా మూవీ కోసం పలువురు స్టార్ దర్శకుల వైపు చూస్తున్నారు. త్రివిక్రమ్ తో మూవీ తర్వాత అయినా ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తే బాగుండేది అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.