Begin typing your search above and press return to search.

ఏడాదిపాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

By:  Tupaki Desk   |   21 May 2022 5:48 AM GMT
ఏడాదిపాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
X
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను 2023 మే 28 వరకూ నిర్వహించబోతున్నట్లు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈనెల 28 నిమ్మకూరులో ఈ వేడుకలను మొదలుపెట్టబోతున్నట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బాలకృష్ణ వెల్లడించారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించబోతున్నట్లు సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈనెల 28న ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులో ఈ వేడుకలను ప్రారంభిస్తామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

'ఈ నెల 28వ తేదీతో ఎన్టీఆర్ నూటో శతజయంతి. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను.. మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో పాలుపంచుకుంటుంది' అని బాలయ్య ప్రకటనలో పేర్కొన్నారు.

మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారని బాలకృష్ణ తెలిపారు.. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకలలో తాను పాల్గొంటానని వివరించారు.

వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత అని ఎన్టీఆర్ తెలిపారు. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటానన్నారు. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతులమీద ప్రారంభిస్తున్నానని తెలిపారు.

365 రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడు లో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నానని వివరించారు.