Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్ - త్రివిక్రమ్' షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకోనున్నారా..?

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:00 PM GMT
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకోనున్నారా..?
X
తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ పై ప్రత్యేక అభిమానం ఏర్పరచుకున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత సినిమా 2018 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని ఇప్పటికే తెలిపారు. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలిస్తే ఆ మ్యాజిక్ కాస్త వేరుగా ఉంటుంది. అరవింద వీరరాఘవ రెడ్డిగా సినిమాలో ఎన్టీఆర్ నుండి కొత్తరకం బాడీ లాంగ్వేజ్, బాషా యాస పలికించాడు త్రివిక్రమ్. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీ అయిపోయాడు. ఇక అల వైకుంఠపురంలో.. తర్వాత త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే చేయనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లోపు విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

రాజకీయ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల పై త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందట. అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం హీరో, డైరెక్టర్ల రెమ్యూనరేషన్ ఇది అంటూ ఓ ప్రచారం జరుగుతుంది. దాని ప్రకారం.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ నలభై కోట్లు, డైరెక్టర్ త్రివిక్రమ్ ఇరవై కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ నడుస్తుంది. హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుందట. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తైయిన తర్వాత గ్యాప్ లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. చూడాలి మరి వీరి కాంబో మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో..!