బిగ్ బాస్ 4 : ఎన్టీఆర్ రాక నిజమేనా?

Fri Dec 06 2019 20:00:01 GMT+0530 (IST)

NTR To back For Bigg Boss 4 Telugu Show

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చిందంటూ స్టార్ మా టీవీ వారు ఘనంగా ప్రకటించిన విషయం తెల్సిందే. సీజన్ 2కు అంతంత మాత్రంగానే రేటింగ్ వచ్చినా కూడా సీజన్ 3 ని చేసిన స్టార్ మా వారు అప్పుడే సీజన్ 4 కోసం ఏర్పాట్లు చర్చలు మొదలు పెట్టారంటూ సమాచారం అందుతోంది. స్టార్ మా స్టాఫ్ అప్పుడే కంటెస్టెంట్స్ కోసం చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సీజన్ 3 మాదిరిగానే సీజన్ 4 లో కూడా చాలా ప్రముఖమైన సెలబ్రెటీలను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇక హోస్ట్ విషయంలో కూడా స్టార్ మా వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సీజన్ 1 కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా.. సీజన్ 2 కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. సీజన్ 3 కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. సీజన్ 3 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కనుక ఖచ్చితంగా మళ్లీ సీజన్ 4 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో స్టార్ మా వారు మళ్లీ హోస్ట్ ను మార్చే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ను మళ్లీ తీసుకు వచ్చేందుకు షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి.

సీజన్ 3 కి నాగార్జున ఎలాంటి వివాదం లేకుండా సాఫీగా సక్సెస్ ఫుల్ గా హోస్టింగ్ చేశాడు. కనుక సీజన్ 4 కు కూడా ఆయన్నే కంటిన్యూ చేయడం కన్ఫర్మ్. ఎన్టీఆర్ తో చర్చలు అనేది నిజం అయ్యి ఉండదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఎన్టీఆర్ ను అప్రోచ్ అయినా కూడా ఆయన ఓకే చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా డేట్లు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ వెంటనే మరో సినిమాను ఆ వెంట వెంటనే వరుసగా సినిమాలను చేయాలనుకుంటున్నాడు. అలాంటి సమయంలో బిగ్ బాస్ వల్ల కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఎన్టీఆర్ సీజన్ 4 ఛాన్స్ వచ్చినా కూడా ఓకే చెప్పే అవకాశం లేదని ఆయన అభిమానులు అంటున్నారు.