కుట్టి స్టోరీ తెలుగు వర్షన్ కు ఎన్టీఆర్

Thu Feb 20 2020 09:42:46 GMT+0530 (IST)

NTR To Become The Voice Of Vijay in Master

తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం ‘మాస్టర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై తమిళ సినీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మద్య కాలంలో విజయ్ ఏ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. అందుకే ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు.కుట్టి స్టోరీ అంటూ సాగే ఈ పాటను విజయ్ మరియు అనిరుధ్‌లు పాడారు. తమిళనాట ఈ పాట వైరల్ అవుతోంది. విజయ్ విభిన్నమైన వాయిస్ తో ఆకట్టుకునే రిధమ్ తో పాడాడు అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ ను కూడా తెలియజేసేలా ఈ పాట ఉండటంతో సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

తెలుగు వర్షన్ లో ఈ పాటను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాడివ్వబోతున్నారట. ఈ పాటను తెలుగులో పాడేందుకు ఇప్పటికే ఎన్టీఆర్ ఓకే చెప్పాడని.. త్వరలో ఆ పాట తెలుగు వర్షన్ ను రికార్డు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విజయ్ సినిమా ప్రమోషన్ కు తెలుగులో ఎన్టీఆర్ పాట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.