Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఎన్టీఆర్ స్టైలిష్ పండుగ స్పెషల్

By:  Tupaki Desk   |   14 Jan 2022 3:32 AM GMT
ఫోటోటాక్ : ఎన్టీఆర్ స్టైలిష్ పండుగ స్పెషల్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కువగా స్టైలిష్ మరియు నయా ట్రెండ్ పైన పెద్దగా ఆసక్తి చూపించరు. ఆయన రెగ్యులర్ గా సూట్ మరియు ఫార్మల్ డ్రెస్సుల్లో మాత్రమే కనిపిస్తారు. ఆయన్ను ఇలా స్టైలిష్ లుక్ లో చూడడం చాలా అరుదు. ఎన్టీఆర్ ను ఫార్మల్ గా చూసినా కూడా అభిమానులు థ్రిల్ ఫీల్ అవుతారు. అలాంటిది తాజాగా ఈ డ్రస్ లో ఆయన్ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎలాంటి డ్రెస్ వేసినా కూడా చాలా హ్యాండ్ సమ్ గా లవ్లీ గా కనిపిస్తారు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ స్టైలిస్ట్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ పండుగ స్పెషల్ కాస్ట్యూమ్స్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ను ఇలా చూడడం కూడా చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ముందు ముందు మరింత స్టైలిష్ లుక్ లో కనిపించాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. టాలీవుడ్ లో విభిన్నమైన కాస్ట్యూమ్స్ ను ట్రై చేసి వాళ్లలో అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిద్దరు చాలా డిఫరెంట్ డ్రెస్సులను మరియు బ్రాండ్ లను ఫాలో అవుతుంటారు. అందుకే వారికి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది.

ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్ కూడా విభిన్నమైన స్టైలిష్ లుక్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రెండ్ కి తగ్గట్టుగా అభిమానులను మరియు ప్రేక్షకులను మెప్పించాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ న్యూ లుక్ కు ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే కొరటాల శివ సినిమా చేసేందుకు ఓకే చెప్పిన ఎన్టీఆర్ ఈ లుక్కుతో ఆ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. జక్కన్న ఆర్.ఆర్.ఆర్ లో కంటే ఇప్పుడు ఎన్టీఆర్ బరువు తగ్గినట్లుగా అనిపిస్తుందని నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. అభిమానులు ఎన్టీఆర్ న్యూ లుక్ కి ఫిదా అవుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్న వాయిదా పడిన విషయం తెలిసిందే. సమ్మర్ లో అయినా ఆ సినిమా విడుదల అవుతుందేమో చూడాలి. జక్కన్న సినిమా తర్వాత కొరటాల శివ సినిమా ను ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.