ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న వార్త

Mon Aug 03 2020 19:00:35 GMT+0530 (IST)

War confusing NTR fans

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు ఇప్పటికే ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యేది. ఇదే సమయంలో త్రివిక్రమ్ దర్వకత్వంలో సినిమా మొదలయ్యేది. వచ్చే సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని కరోనా కారణంగా మొత్తం పరిస్థితి తారు మారు అయ్యింది. కాస్త లేట్ అయిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబో మూవీ వచ్చే ఏడాదిలో రానుంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఒక వార్త నందమూరి అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటి వరకు త్రివిక్రమ్ సూపర్ హిట్స్.. బ్లాక్ బస్టర్ హిట్స్ చూస్తే అవన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్. అల వైకుంఠపురంలో చిత్రం ఒక సింపుల్ కథ అయినా కూడా తన టేకింగ్ తో కుటుంబ ప్రేక్షకులను కట్టి పడేశాడు. అందుకే ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ తో కూడా అలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను తీసి హిట్ కొట్టాలని అరవింద సమేత చిత్రం వంటి ప్రయోగంను చేయవద్దంటూ మొదటి నుండి త్రివిక్రమ్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఈసారి కూడా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్రయోగమే చేస్తున్నాడట. ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ ఎడ్వంచర్ చేసే హీరో పాత్రలో చూపించబోతున్నాడట. త్రివిక్రమ్ ఇప్పటి వరకు ట్రై చేయని జోనర్ లో ఈ సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే కథ సిద్దం అయ్యిందట. ఇప్పుడు ఈ వార్త నందమూరి ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. ఎన్టీఆర్ తో మళ్లీ ప్రయోగం చేస్తే అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనే అనుమానంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు సినిమా ఏ జోనర్ అనేది అధికారికంగా క్లారిటీ వస్తే కాని చెప్పలేం. ఇప్పటి నుండే ఫ్యాన్స్ ఎక్కువగా ఊహించుకుని పుకార్లను నమ్మి హైరానా పడనక్కర్లేదు అంటున్నారు కొందరు.