Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్‌ ప‌నికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అస‌హ‌నం?

By:  Tupaki Desk   |   30 Jun 2022 3:30 PM GMT
స్టార్ డైరెక్ట‌ర్‌ ప‌నికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అస‌హ‌నం?
X
స్టార్ హీరో- క్రేజీ డైరెక్ట‌ర్ .. బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ రీపీట్ అవుతోందంటే ఫ్యాన్స్ లో వుండే జోష్.. ఆ ప్రాజెక్ట్ పై ఏర్ప‌డే క్రేజ్‌ వేరే లెవెల్లో వుంటుంది.. కానీ ప్ర‌స్తుతం అలా జ‌ర‌గ‌డం లేదు. హీరో ఫ్యాన్స్ మాత్రం అస‌హ‌నానికి లోన‌వుతున్నార‌ట‌. వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ల‌ది బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో 'జ‌న‌తా గ్యారేజ్' వంటి ప‌వ‌ర్ ఫుల్‌ బ్లాక్ తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ మ‌రో సారి క‌లిసింది.

ఎన్టీఆర్ 30వ సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందించ‌బోతున్న విష‌యం తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ మిక్కిలినేని ఈ భారీ పాన్ ఇండియా మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ మూవీ నుంచి డైలాగ్ మోష‌న్ టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించారు కూడా. కానీ ఇప్ప‌టికీ ఈ మూవీ ప‌ట్టాలెక్క‌డం లేదు.

ఇటీవ‌ల కొర‌టాల 'ఆచార్య‌'తో భారీ డిజాస్ట‌ర్ ని ఎదుర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తొలి ప్రాజెక్ట్ ని కొర‌టాల కాపాడ‌లేక‌పోయాడు అనే విమ‌ర్శ‌లు వినిపించాయి. మెగా కెరీర్ లోనే 'ఆచార్య‌' భారీ డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో త‌దుప‌రి సినిమాని ఎన్టీఆర్ తో కొర‌టాల చేయ‌బోతుండ‌టంతో ఆయ‌న ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డ్డారు. ఈసారి అయినా హిట్టిస్తాడా? .. మ‌ళ్లీ అదే త‌ప్పుని పున‌రావృతం చేస్తాడా? అని అనుమానాల్ని వ్య‌క్తం చేశారు.

డైలాగ్ మోష‌న్ టీజ‌ర్ బ‌య‌టికి రావ‌డం.. అందులోని డైలాగ్ లు ఆక‌ట్టుకోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక జూన్ ఎండ్ లేదా జూలై ఫ‌స్ట్ వీక్ లో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డ‌మే త‌రువాయి అనుకున్నారు. కానీ అది జ‌ర‌గ‌డం లేద‌ని, ఈ మూవీ ప‌ట్టాలెక్క‌డానికి మ‌రో రెండు నెల‌ల వేచి చూడాల్సిందే అని తెలియ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస‌హ‌నానికి గుర‌వుతున్నార‌ట‌. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లోనే ప‌ట్టాలెక్కాల్సిన ఈ మూవీ ఇంత వ‌ర‌కు ప్రారంభం కాక‌పోవ‌డంతో అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కొర‌టాల స్క్రిప్ట్ ప‌రంగానూ, మంచి ముహూర్తం ప‌రంగానూ త‌న‌కు మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం కావాల‌ని ఎన్టీఆర్ ని అడ‌గ‌డ‌మే అని తెలుస్తోంది. స్క్రిప్ట్ లో ఎలాంటి లోపాలు లేకుండా ప‌ర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ‌దామ‌ని, అంత వ‌ర‌కు వేచి వుండ‌మ‌ని ఎన్టీఆర్ ని కొర‌టాల రిక్వెస్ట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ విష‌యం బ‌య‌టికి రావ‌డంతో కొర‌టాల‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస‌హ‌నాన్నివ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

ఇంత‌కీ ఈ ప్రాజెక్ట్ ఎప్ప‌టికి ప‌ట్టాలెక్కుతుంద‌ని, ముందు కు వెళుతుందా?.. వెళ్ల‌దా అని ఫ్యాన్స్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. 'RRR' బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఫుల్ స్వింగ్ లో వున్న ఎన్టీఆర్ 30వ సినిమాని ప్రారంభించ‌డానికి ఇదే రైట్ టైమ్ అని ఇప్ప‌టికైనా మొద‌లు పెడితే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ వాపోతున్నార‌ట‌. అంతే కాక‌కుండా రాజ‌మౌళి సెంటిమెంట్ కూడా ఫ్యాన్స్ ని వెంటాడుతున్న‌ట్టుగా చెబుతున్నారు.