Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్‌ నిర్ణయం పట్ల ఎన్టీఆర్‌ అసంతృప్తి!!

By:  Tupaki Desk   |   3 May 2020 6:10 AM GMT
త్రివిక్రమ్‌ నిర్ణయం పట్ల ఎన్టీఆర్‌ అసంతృప్తి!!
X
అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌ తో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ 30కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులు అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ముగిసిన వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభం కాబోతుందన్నారు. మే లేదా జూన్‌ లో ఈ సినిమాను ప్రారంభించి వచ్చే సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

కరోనా కారణంగా సినిమా షెడ్యూల్స్‌ అన్ని కూడా గందరగోళంగా తయారు అయ్యాయి. దాంతో ఎన్టీఆర్‌ 30 సినిమా ప్రారంభంకు చాలా నెలలు పట్టే అవకాశం కనిపిస్తుంది. అల వైకుంఠపురంలో వంటి భారీ విజయం తర్వాత చాలా గ్యాప్‌ రావద్దనుకుంటున్న త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌ తో సినిమా కంటే ముందు మరో సినిమాను స్పీడ్‌ గా చేసేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట. చాలా కాలంగా కూడా వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది.

ఎన్టీఆర్‌ తో సినిమా ప్రారంభంకు ముందే వెంకటేష్‌ తో సినిమాను మొదలు పెట్టి కేవలం అయిదు నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత ఎన్టీఆర్‌ 30 ని మొదలు పెట్టే యోచనలో త్రివిక్రమ్‌ ఉన్నాడట. ప్రస్తుతం నారప్ప చేస్తున్న వెంకటేష్‌ రెండు వారాల షూట్‌ తో ఆ సినిమా పూర్తి చేయబోతున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ తో నటించనున్నాడట. చాలా కాలం క్రితమే వెంకీకి స్క్రిప్ట్‌ ను రెడీ చేసిన త్రివిక్రమ్‌ ప్రస్తుతం పినిషింగ్‌ టచ్‌ ఇచ్చే పనిలో ఉన్నాడట.

ఎన్టీఆర్‌ ఈ విషయమై అసంతృప్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు. త్రివిక్రమ్‌ తదుపరి చిత్రాన్ని తనతోనే చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ ఉన్నాడట. కాని చాలా ఆలస్యం అవుతున్న కారణంగా త్రివిక్రమ్‌ ను వెయిట్‌ చేయమని చెప్పలేని పరిస్థితి. బాహాటంగా చెప్పకున్నా కూడా త్రివిక్రమ్‌ పై ఎన్టీఆర్‌ అసంతృప్తితో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.