ఎన్టీఆర్ లవ్ దెబ్బని షేక్ చేస్తోన్న 'బీస్ట్' సాంగ్!

Fri Feb 18 2022 15:03:00 GMT+0530 (India Standard Time)

NTR Craze fan made video is sensational

యంగ్ టైగర్ ఎన్టీఆర్-రకుల్ ప్రీత్ సింగ్ జటగా తెరకెక్కిన `నాన్నకు ప్రేమతో` చిత్రంలోని లవ్ దెబ్బ సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో తారక్-రకుల్ పోటీ పడీ మరి లవ్ బెద్బకి స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్టీఆర్ క్లాస్..మాస్ స్టెప్పులతో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ స్టెప్పులు  యూ ట్యూబ్ లో వైరల్ గా మారింది.



అందుకు కారణం  కోలీవుడ్ హీరో ఇలయదళపతి. విజయ్ హీరోగా  నెల్సన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్  ` బీస్ట్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో యూనిట్ ప్రచారం పనులు ప్రారంభించింది.

దీనిలో భాగంగా `అరబిక్ కుతూ` అంటూ సాగే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాటని  లవ్ దెబ్బ పాటలో ఎన్టీఆర్  వేసిన స్టెప్పులకు అభిమానులు సింక్ చేసి ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పాట..ఎన్టీఆర్ స్టెప్పులు మరోసారి వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ ఎనర్జీ..డాన్స్ మూవ్ మెంట్స్...అనిరుద్ సంగీతం పర్పెక్ట్ గా కుదిరాయి.

ఇప్పటికే ఈ వీడియోని  ట్విటర్ లో 1.1 మిలియన్లకు పైగా వీక్షించారు. ఇది నిజంగా సంచలనమనే చెప్పాలి.  ఓ ప్యాన్ మేడ్ వీడియోకి ఈ రేంజ్ లో  రెస్పాన్స్ వచ్చిందంటే అసాధారణ విషయంగానే పరిగణించాలి. కేవలం కొంత మంది స్టార్ హీరోల ప్రచార చిత్రాలకు మాత్రమే సాధ్యమయే ఇలాంటి రికార్డు ఫ్యాన్ మేడ్ వీడియోకి రావడం గొప్ప విషయమే.

ఈ ప్యాన్ మేడ్ వీడియో  ప్రేక్షకుల్లో కి మరో సంకేతం కూడా పంపినట్లు అయింది. ఈ సందర్భంగా  ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే సినిమాకి అనిరుద్ సంగీతం అందించాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.