తారక్ కొత్త బ్రాండ్ సెలెక్ట్ చేసుకొన్నాడు!

Wed Jul 11 2018 19:32:21 GMT+0530 (IST)

తెలుగులో పవన్ కళ్యాణ్ మినహా మిగతా కథానాయకులంతా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేవాళ్లే. తక్కువ కాల్షీట్లతో పని పూర్తవ్వడం... ఎక్కువ రెమ్యునరేషన్ లభించే అవకాశం ఉండటంతో హీరోలు బ్రాండ్లవైపు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. ఒకప్పుడు మహేష్ రెండేళ్లపాటు సినిమాలేమీ చేయకుండా కేవలం బ్రాండ్లతోనే సంపాదించేశాడు. అంత పవర్ ఫుల్ బ్రాండింగ్ అంటే. అందుకే కథానాయకులు ఇలాంటి అవకాశాల్ని అస్సలు వదులుకోరు. పవన్ మాత్రం తాను ఆ వస్తువుల్ని వాడకుండానే ఎలా ప్రచారం చేసేదని చెబుతుంటారు. ఒకొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుంది కానీ.. చాలా మంది తారలు మాత్రం ఇదొక మంచి ఆదాయ వనరుగా భావిస్తుంటారు.తాజాగా తారక్ చేతికి మరో బ్రాండ్ వచ్చింది. సెలెక్ట్ అనే మొబైల్ ఛైన్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు.  ఈ మొబైల్ స్టోర్లకి ఎన్టీఆర్ ఏడాదిపాటు ప్రచారం చేసి పెడతారట. అందుకుగానూ పెద్దయెత్తునే పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం. ఆయన ఇదివరకు నవరత్న  ఆయిల్ మొదలుకొని... ఐపీఎల్ వరకు పలు బ్రాండ్లకి ప్రచార కర్తగా వ్యవహరించారు. మరి ఈ సెలెక్ట్ మొబైల్స్ ప్రచారంకోసం ఎలాంటి యాడ్స్‌లో కనిపిస్తారో చూడాలి.