సోదరుడి బర్త్ డే నాడు ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్...!

Sun Jul 05 2020 11:25:14 GMT+0530 (IST)

NTR Birthday Wishes to KalyanRam

నేడు నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్ బర్త్ డే. 1978 జూలై 5న జన్మించిన కళ్యాణ్ రామ్ 43వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ సెలబ్రిటీలు.. నందమూరి అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ లో అన్నకి విషెస్ చెప్పారు. ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ''కేవలం బ్రదర్ గానే కాకుండా గత కొన్నేళ్లుగా నాకు స్నేహితుడిగా దిశానిర్దేశకుడిగా సలహాలు సూచనలిచ్చే గైడ్ గా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ అన్నా. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి'' అని పేర్కొన్నాడు. కాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి పలు నిర్మాణ సంస్థలు కూడా ట్విట్టర్ లో కళ్యాణ్ రామ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసారు.కాగా నందమూరి తారకరామారావు నటవారసులుగా రెండు తరాల హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. బాలకృష్ణ - హరికృష్ణ - ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ - తారకరత్న తదితరులు టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. వారిలో కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మాతగా తెలుగు చిత్రసీమలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 'బాలగోపాలుడు' సినిమాలో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత చేసిన 'అతనొక్కడే' 'లక్ష్మీ కళ్యాణం' 'పటాస్' సినిమాలు కళ్యాణ్ రామ్ కెరీర్ లో మంచి చిత్రాలుగా నిలిచిపోయాయి. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు.