Begin typing your search above and press return to search.

అరవింద రాఘవుడు నెగ్గుతాడా ?

By:  Tupaki Desk   |   8 Aug 2018 8:53 AM GMT
అరవింద రాఘవుడు నెగ్గుతాడా ?
X
జైలవకుశ తర్వాత ఏడాది గ్యాప్ తో రాబోతున్న అరవింద సమేత వీర రాఘవ మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు. మాటల మాంత్రికుడితో మొదటిసారి జట్టు కట్టిన యంగ్ టైగర్ నోటి వెంట ప్రాసలు పంచులు వినాలని తెగ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ దసరా డెడ్ లైన్ మీద చాలా వేగంగా జరుగుతోంది. రిలీజ్ అనుకుంటున్న అక్టోబర్ 11 ముంచుకు వస్తున్న నేపధ్యంలో ఇంకా చాలా భాగం బాలన్స్ ఉంది. పాటల చిత్రీకరణ అసలు ఇంకా మొదలేపెట్టలేదని ఇన్ సైడ్ టాక్. స్క్రిప్ట్ ఎంత పక్కా ఉన్నా తెరకెక్కించే విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది.

అరవింద సమేత వీర రాఘవ మీద ఎంత హైప్ ఉన్నా అది ఓపెనింగ్స్ వరకే ఉపయోగపడుతుంది. మిగిలిన భారాన్ని మోయాల్సింది అందులోని కంటెంటే. ఇప్పటికే వంద కోట్ల బిజినెస్ ని టార్గెట్ చేస్తున్నారని దానికి తగ్గట్టే రేట్లు చెబుతున్నారని వినికిడి. కానీ త్రివిక్రమ్ ఎంత మేజిక్ చేస్తాడనే పేరున్నా అజ్ఞాతవాసి తరవాత బ్రాండ్ డ్యామేజ్ అయిన మాట వాస్తవం. పెన్నులో బలం తగ్గిందా అనే రీతిలో ఊరికే ప్రాస కోసం రాసుకున్నట్టున్న పేలవమైన సన్నివేశాలు టేకింగ్ సినిమాను దారుణంగా దెబ్బ తీశాయి. అరవిందలో సైతం అలాంటి ప్రయోగాలు ఏమైనా చేసాడేమో అన్న అనుమానం కలగడం సహజం. దానికి తోడు ఆ మధ్య నాగబాబు-తారక్ ఉన్న స్టిల్ ఒకటి లీక్ అయ్యింది కానీ రెగ్యులర్ గా జూనియర్ మాస్ సినిమాల్లో కనిపించే సీన్ లాగే అనిపించడంతో ఫ్యాన్స్ సైతం ఏమంత థ్రిల్ ఫీల్ కాలేదు.

సో దసరా పండుగకు అన్ని వైపులా ముంచుకు వస్తున్న సవాళ్ళను అరవింద రాఘవులు అందుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నష్టం మామూలుగా ఉండదు. పైగా జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత ఫాలోయింగ్ ఉన్నా వంద కోట్లు ఈజీగా దాటించే రేంజ్ ఇంకా రాలేదు. అలా జరగాలి అంటే సినిమా గురించి అద్భుతం అనే యునానిమస్ టాక్ రావాలి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రిస్క్ లేకుండా కాస్త రొటీన్ లైన్ నే త్రివిక్రమ్ తీసుకున్నాడు అనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అంత పెద్ద టార్గెట్ ను అందుకోవాలి అంటే యుద్ధమే చేయాలి.