ఎన్టీఆర్ ని రాజమౌళి మర్చిపోయాడా.. లైట్ తీసుకున్నాడా?

Sun May 22 2022 18:05:14 GMT+0530 (IST)

NTR And Rajamouli

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రముఖులు ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. ఆయన అభిమానులు లక్షల మంది ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలో చాలా మంది సన్నిహితులు ఉంటారు. వారిలో రాజమౌళి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాంటి రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పక పోవడం విడ్డూరంగా ఉందంటూ నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి అవ్వగానే ఎన్టీఆర్ అంతగా కానివాడు అయ్యాడా అంటూ రాజమౌళిని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ట్వీట్ చేయలేనంత బిజీగా ఎన్టీఆర్ ఉన్నాడా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే ఆయన్ను సమర్థించే వారు ఉన్నారు.

మే 20వ తారీకున రాజమౌళి అందుబాటు లో లేడు... ఆయన బిజీగా ఉండి ఉంటాడు అందుకే ఎన్టీఆర్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందజేయ లేదు అని కొందరు అనుకుంటూ ఉన్నా.. కొందరు మాత్రం అదే రోజున ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన రెండు ట్వీట్స్ ను రాజమౌళి రీ ట్వీట్ చేశాడు. అంటే ఆయన అందుబాటులోనే.. అందరికి సన్నిహితంగానే ఉన్నాడు. కనుక కావాలని ఎన్టీఆర్ బర్త్ డే ను అవైడ్ చేశాడేమో అనిపిస్తుంది.

ఎన్టీఆర్ కు సంబంధించినంత వరకు రాజమౌళిని చాలా ఆప్తుడిగా భావిస్తాడు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కాని రాజమౌళి అలా చూడటం లేదేమో అంటూ కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తాను వర్క్ చేస్తున్న.. చేయబోతున్న స్టార్స్ కు సంబంధించిన బర్త్ డేలకు విశేష్ లు చెబుతాడు. వేరే వారికి పర్సనల్ గా మెసేజ్ లు చేయడం చేస్తాడట.

రాజమౌళి మొన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఖచ్చితంగా మెసేజ్ అయినా చేసి ఉంటాడు.. లేదంటే ఫోన్ అయినా చేసి ఉంటాడు. కాని అభిమానులు మాత్రం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పలేదు అనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ ను చేస్తున్న విషయం తెల్సిందే. ఇదే ఏడాది చివరి వరకు సినిమా పట్టాలెక్కేలా ప్లాన్ చేస్తున్నారు.