Begin typing your search above and press return to search.

అప్పుడు కొర‌టాల‌.. ఇప్పుడు తార‌క్?

By:  Tupaki Desk   |   2 Feb 2023 6:09 PM GMT
అప్పుడు కొర‌టాల‌.. ఇప్పుడు తార‌క్?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ ని ఏ క్ష‌ణాన ప్ర‌క‌టించారో గానీ అడుగ‌డుగునా ఈ ప్రాజెక్ట్ ల‌కు అడ్డంకులే ఎదుర‌వుతున్నాయి. అయితే ఈ అడ్డంకుల‌కు ప్ర‌ధాన కార‌ణం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లే. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో 30వ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సుదాక‌ర్ మిక్కిలినేని నిర్మించ‌బోతున్నారు. 2022 మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేస్తూ ఐదు భాష‌ల్లో ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు కూడా. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డి నెల‌లు గ‌డుస్తున్నా ఎన్టీఆర్ 30వ సినిమా ముందుకు వెళ్ల‌డం లేదు. `ఆచార్య‌` డిజాస్ట‌ర్ భ‌యం కార‌ణంగా స్క్రిప్ట్ వ‌ర్క్ లో ఇంత కాలంగా కొర‌టాల శివ మార్పులు చేర్పులు చేస్తూ వ‌చ్చారు. దీంతో ఈ మూవీ ఫార్మ‌ల్ పూజా, రెగ్యుల‌ర్ షూటింగ్ నెల‌ల త‌ర‌బ‌డి ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.

అయితే తాజాగా ఈ మూవీ ఫైన‌ల్ స్క్రిప్ట్ ని కొర‌టాల లాక్ చేశార‌ట‌. ఎన్టీఆర్ ఫైన‌ల్ కాల్ కోసం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఎదురు చూస్తున్నార‌ట‌. ఎన్టీఆర్ ఫైన‌ల్ అంటే ఫార్మ‌ల్ పూజ‌కు వెళ్ల‌డ‌మే త‌రువాయి అని తెలుస్తోంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా ఫుల్ స్వీంగ్ లో వున్న ఈ మూవీ స్క్రిప్ట్ కి ఎన్టీఆర్ ఫైన‌ల్ గా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే ఫార్మ‌ల్ పూజని పూర్తి చేసి రెగ్యుల‌ర్ షూట్ కి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ముందు ఈ మూవీ రెగ్యుల‌ర్ షూట్ ని ఫిబ్ర‌వ‌రిలో మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేశారు.

అయితే ఎన్టీఆర్ డిలే చేయ‌డంతో రెగ్యుల‌ర్ షూటింగ్ ని మార్చి మూడ‌వ వారం నుంచి ప్రారంభించాల‌నుకుంటున్నార‌ట‌. వ‌న్స్ ఎన్టీఆర్ ఫైన‌ల్ కాల్ ఇచ్చేస్తే పూజా పూర్తి చేసి వ‌చ్చే నెల నుంచి శంషాబాద్ లో ఏర్పాటు చేసి ప్ర‌త్యేక సెట్ లో ఫ‌స్ట్ షెడ్యూల్ ని, త‌దుప‌రి షెడ్యూల్ ని గోవాలో చ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. ఇక జాన్వీ క‌పూర్ ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.

త‌న డేట్స్ కూడా క్లాష్ కాకుండా చూసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ చిత్ర బృందానికి తార‌క‌ర‌త్నం హెల్త్ అప్ సెట్ కూడా టెన్ష‌న్ పెడుతున్నట్టుగా చెబుతున్నారు. ఇవ‌న్నీ రీ సెట్ అయ్యే స‌రికి ముందు అనుకున్న ప్లాన్ కాస్తా మారి మార్చి ఎండ్ కి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం వుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఈ మూవీకి ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండ‌గా, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా సాబు సిరీల్ వ‌ర్క్‌చేస్తున్నారు. సంగీతం అనిరుధ్ అందిస్తున్నాడు.ఈ మూవీని 2024 ఏప్రిల్ 5న విడుద‌ల చేస్తామంటూ చిత్ర బృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.