Begin typing your search above and press return to search.

#NBK107 పోస్టర్: ఊర మాస్ అవతార్ లో నటసింహం..!

By:  Tupaki Desk   |   28 May 2022 5:50 AM GMT
#NBK107 పోస్టర్: ఊర మాస్ అవతార్ లో నటసింహం..!
X
నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో హై ఇంటెన్స్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే #NBK107 నుంచి విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతిని పురస్కరించుకుని మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు.

బాలకృష్ణను క్రూరమైన అవతారంలో ఆవిష్కరించే ఈ మాస్ పోస్టర్‌ ను రిలీజ్ చేయడం ద్వారా మేకర్స్ దివంగత లెజెండరీ నటుడికి పరిపూర్ణ నివాళి అర్పించారు. ఇందులో వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఉన్న బాలయ్య.. తన చేతిలో రక్తంతో తడిసిన ఒక పెద్ద కత్తిని పట్టుకుని నిలబడి ఉన్నారు.

లైట్ గా గడ్డం మరియు మీసాలతో, బాలకృష్ణ ఇక్కడ యంగ్ మరియు డాషింగ్‌ గా కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో ఒక టెంపుల్ మరియు జనాల గుంపును మనం గమనించవచ్చు. #NBK107 లో యాక్షన్ పాళ్లు కాస్త ఎక్కువగా ఉంటాయని ఈ మాస్ పోస్టర్ సూచిస్తోంది.

బాలకృష్ణకు వీరాభిమాని అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. తన ఆల్-టైమ్ ఫేవరెట్ స్టార్ ని ఇంతకు ముందెన్నడూ చూడని మాస్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తే.. ఇప్పుడొచ్చిన మాస్ పోస్టర్ సినిమాలో హై ఇంటెన్స్ యాక్షన్‌ కు హామీ ఇస్తోంది.

NBK107 సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ - ప్రముఖ మలయాళ నటుడు లాల్ - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి స్పెషల్ నంబర్ లో ఆడిపాడనుంది.

'అఖండ' - 'క్రాక్' వంటి తమ చివరి చిత్రాలతో కెరీర్‌ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌లను అందుకున్న బాలయ్య - గోపీచంద్ మలినేని తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్ప‌టికే 40% చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్ ఫుట్ పై మేకర్స్ సంతృప్తిగా ఉన్నారు. మూవీ టైటిల్‌ ను త్వరలోనే ప్రకటించనున్నారు.

మైత్రీ నిర్మాతలు నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని చూసుకుంటున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ క్రాఫ్ట్స్‌ మెన్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఫైట్స్ కంపోజ్ చేస్తున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.