Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ - ప్రశాంత్ నీల్... హీరో - విలన్‌ డబుల్‌ ధమాకా

By:  Tupaki Desk   |   26 Sep 2022 5:30 PM GMT
ఎన్టీఆర్‌ - ప్రశాంత్ నీల్... హీరో - విలన్‌ డబుల్‌ ధమాకా
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత పాన్‌ ఇండియా స్థాయి క్రేజ్ దక్కించుకున్నాడు. నెట్‌ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా స్ట్రీమింగ్‌ అవ్వడంతో పలు దేశాల్లో కూడా ఎన్టీఆర్‌ కి అభిమానులు క్రియేట్‌ అయ్యారు అనడంలో సందేహం లేదు. పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్ డమ్‌ దక్కించుకున్న ఎన్టీఆర్‌ తదుపరి సినిమాను అదే రేంజ్‌ లో చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.

ఇప్పటికే కొరటాల శివ తో తన 30వ సినిమాకు కమిట్‌ అయిన కొరటాల శివ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఊగిసలాటలో ఉన్నట్లుగా ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్‌ 31వ సినిమా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే.

ఇప్పటికే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతా సలార్‌ ను చేస్తున్న ప్రశాంత్‌ నీల్‌ ఆ వెంటనే ఎన్టీఆర్‌ తో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది.

ప్రశాంత్‌ నీల్‌ ఇప్పటికే ఎన్టీఆర్‌ కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట. సలార్‌ ముగించిన తర్వాత మళ్లీ ఒకసారి ఫైనల్‌ గా స్క్రిప్ట్‌ వర్క్‌ చేసి షూటింగ్‌ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ మరియు ప్రశాంత్ నీల్‌ కాంబో సినిమా పై ఇంట్రెస్టింగ్‌ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఎన్టీఆర్‌ ను ప్రశాంత్‌ నీల్‌ తన సినిమాలో డబుల్‌ రోల్‌ లో చూపించబోతున్నాడట. పైగా హీరో మరియు విలన్‌ గా ఎన్టీఆర్ నే చూపించే విధంగా స్క్రిప్ట్‌ ను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రిపేర్ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ప్రస్తుతం ఇంట్రెస్టింగ్‌ గా చర్చ జరుగుతోంది. ఒక వేళ ఇదే కనుక నిజం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎన్టీఆర్‌ 31 తో డబుల్‌ ధమాకా ఖాయం.

గతంలో జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. అందులో ఒక పాత్ర ను నెగటివ్ షేడ్స్ లో చూపించడం జరిగింది. విలన్ గా కనిపించేందుకు చాలా ఆసక్తి చూపించే ఎన్టీఆర్‌ కు ఒక ఛాలెంజింగ్‌ పాత్రను ప్రశాంత్‌ నీల్‌ డిజైన్ చేసి ఉంటాడు అంటూ అభిమానులు చాలా నమ్మకంతో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.