Begin typing your search above and press return to search.

#DRUGS ఆ ఆరుగురికి బెయిలొస్తుందా? రియా బ‌య‌టికొస్తే సాక్ష్యాలు తారుమారే!!

By:  Tupaki Desk   |   28 Sep 2020 5:38 PM GMT
#DRUGS ఆ ఆరుగురికి బెయిలొస్తుందా? రియా బ‌య‌టికొస్తే సాక్ష్యాలు తారుమారే!!
X
బాలీవుడ్ డ్ర‌గ్స్ డొంక కూసాలు క‌దిలిపోతున్నాయి. ఇందులో అరెస్టుల ఫ‌ర్వం విచార‌ణ‌ల ఫ‌ర్వం అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. ఇటీవ‌ల ప‌లువురు టాప్ హీరోయిన్ల‌ను ఈ కేసులో ఎన్.సి.బి విచారించింది. ఇంకా పెద్ద సెల‌బ్రిటీలు ఈ డొంక‌లో చిక్క‌నున్నారని క‌థ‌నాలొస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మరే ఇతర ప్రముఖులను పిలవడానికి ఆతురుతలో లేదని.. ప్రస్తుతం రియా చక్రవర్తి మరియు బాంబే హైకోర్టులో ఉన్న మరో ఐదుగురు నిందితుల బెయిల్ విచారణపై దృష్టి సారించింద‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

సాక్షులు నిందితుల వాంగ్మూలాలన్నింటినీ పరిశీలించి విశ్లేషిస్తారని.. ఎన్‌సిబి ఏదో దోషపూరితమైనదని కనుగొంటే అవసరమైనప్పుడు ఇతరులను పిలవడంపై నిర్ణయిస్తుందని ఏఎన్.ఐ క‌థ‌నం వెలువ‌రించింది.

ఇక స్టార్లు పెడ్ల‌ర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు కూడా స్కాన్ చేయబడతాయి. ఎవ‌రైనా దోషిగా తేలితే ఎన్.‌సిబి కొత్త విష‌యాల ఆధారంగా దర్యాప్తున‌కు ముందుకు వెళ్తుంది. బాలీవుడ్ సంబంధిత డ్రగ్స్ కేసులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ఇంకా ఆరు నెలలు మిగిలి ఉన్నందున.. ఫోన్ స్కానింగ్ విషయంలో ఎన్‌సిబికి సమయం ఉంది`` అని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది.

అంతకుముందు సెప్టెంబర్ 11 న రియా.. ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి ఇతరుల బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. రియా బెయిల్ పై విడుదలైతే ఆమె ఇతర నిందితులను అప్రమత్తం చేయవచ్చని వారు ఈ విషయంలో సాక్ష్యాలను నాశనం చేయవచ్చని గమనించారని కూడా స‌ద‌రు జాతీయ మీడియా క‌థ‌నం వెలువ‌రించ‌డం విశేషం.

సెప్టెంబర్ 27 న ఎన్.‌సిబి సినీస్టార్లు దీపికా పదుకొనే- శ్రద్ధా కపూర్ - సారా అలీ ఖాన్- రకుల్ ప్రీత్ సింగ్ ఇతరుల మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. కరీష్మా ప్రకాష్ - సారా అలీ ఖాన్ - దీపికా పదుకొనే- శ్రద్ధా కపూర్ల వాంగ్మూలాలను ఎన్‌.సిబి సెప్టెంబర్ 26 న నమోదు చేసింది. కరిష్మా ప్రకాష్,.. సారా అలీ ఖాన్,.. దీపికా పదుకొనే,.. శ్రద్ధా కపూర్ వాంగ్మూలాలు నమోదు చేయబడ్డాయి. క్షితిజ్ ప్రసాద్ ‌ను ప్రశ్నించిన తరువాత అరెస్టు చేశారు. ఈ రోజు తాజా సమన్లు జారీ చేయబడలేదు. మేము 18 మందికి పైగా అరెస్టు చేసాం`` అని ఎన్‌.సిబి సౌత్-వెస్ట్రన్ రీజియన్ డిప్యూటీ డిజి ముతా అశోక్ జైన్ శనివారం చెప్పారు.