మొన్న చరణ్..నిన్న ప్రభాస్..నేడు బాలయ్య!

Mon Sep 26 2022 11:27:57 GMT+0530 (India Standard Time)

NBK 107 Movie Scene Leaked

టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ ముగియడంతో మళ్లీ టాప్ హీరోల సినిమాల షూటింగ్ లు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి కిరణ్ అబ్బవరం వరకు ప్రతీ హీరో సెట్ లో సందడి చేస్తున్ఆనడు. అయితే స్టార్ హీరోలకు మాత్రం లీకులు ఇబ్బందికరంగా మారాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. లీకులపై కఠన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేసినా లీకులు ఎక్కడా ఆగడం లేదు. స్టార్ హీరోల ఆన్ లొకేషన్ వీడియోలు ఫొటోలు వరుసగా లీక్ అవుతూనే వున్నాయి.గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏస్ డైరెక్టర్ శంకర్ ల తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న   RC15 ఆ మధ్య రాజమండ్రిలో కీలక ఘట్టాల చిత్రీకరణ జరుపుకుంది. దీనికి సంబంధించిన ఆన్ లొకేషన్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారి మేకర్స్ ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అంతే కాకుండా రామ్ చరణ్ లుక్ కి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ కావడంతో మేకర్స్ లీగల్ గా యాక్షన్ తీసకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

అయినా సరే లీకులు ఆగడం లేదు. రీ సెంట్ గా ప్రభాస్ నటిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సలార్' మూవీకి సంబంధించిన కీలక సీన్ కి సంబంధించిన షూటింగ్ ఫుటేజ్ కూడా నెట్టింట లీక్ కావడం.. అది వైరల్ కావండం తెలిసిందే. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణం రాజు ఆకస్మిక మృతి తరువాత ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'సలార్' సెట్ లోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా సీరియస్ సీన్ ని ప్రభాస్ కొంత మంది పాల్గొనగా చిత్రీకరిస్తున్న సీన్ ని కొంత మంది లీక్ చేసిన విషయం తెలిసిందే.  

ఇదిలా వుంటే తాజాగా లీకుల బెడద సీనియర్ హీరోలని కూడా తాకింది.  వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ 'అఖండ'తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈ సినిమా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని తో చేస్తున్న విషయం తెలిసిందే. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట లీక్ అయి వైరల్ గా మారింది. విలన్ లపై ఉగ్ర రూపం దాల్చిన బాలకృష్ణ ఒకడి చేతిని నరకడం...ఇదే సందర్భంగా విలన్స్ ని ఉద్దేశించి పవర్ ఫుల్ డైలాగ్ చెప్పడం.. సీన్ పూర్తి కాడానే వెళ్లి బాలయ్య చేతిలో వెపన్ పట్టుకుని వెళ్లి రిలాక్స్ అవుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

లీక్ అయిన వీడియో మాత్రం పవర్ ప్యాక్డ్ గా వుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లీక్ విషయంలో మేకర్స్ ఫీలవుతుంటే ఫ్యాన్స్ మాత్రం సినిమాలో బాలయ్య సింహగర్జన చేయబోతున్నాడని తెలిసి హ్యాపీగా ఫీలవుతున్నారట.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.