స్మాల్ మూవీస్ కి అండగా స్టార్ ప్రొడక్షన్ హౌస్!

Mon Jun 27 2022 05:00:01 GMT+0530 (IST)

Mythri Movie Makers In Support Of Small Movies

టాలీవుడ్ లో సమీకరణాలన్నీ మారుతున్నాయి. మన సినిమాలకు భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ అయిన నేపథ్యంలో చాలా వరకు నిర్మాణ సంస్థలు బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా మూవీస్ క్రేజీ బడ్జెట్ మూవీస్ చేస్తూనే చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే గీతాఆర్ట్స్ సురేష్ ప్రొడక్షన్స్ యువీ వంటి ప్రొడక్షన్ హౌస్ లు చిన్న సినిమాకు అండగా నిలుస్తుంటే తాజా మరో క్రేజీ ప్రొడక్షన్ కంపనీ కూడా స్మాల్ మూవీస్ కి సపోర్ట్ గా నిలుస్తోంది.  



ప్రస్తుతం టాలీవుడ్ లో ఏడెనిమిది క్రేజీ ప్రాజెక్ట్ లని నిర్మిస్తూనే చిన్న సినిమాలకు అండగా నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి స్మాల్ హీరో కిరణ్ అబ్బదరం వరకు వరుస ప్రాజెక్ట్ లు నిర్మిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇప్పటికే సుధీర్ బాబు కృతికశెట్టి కలిసి నటిస్తున్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` లావణ్య త్రిపాఠి నటిస్తున్న `హ్యాపీ బర్త్ డే` కిరణ్ అబ్బవరం హీరోగా ఓ స్మాల్ మూవీని నిర్మిస్తున్నారు. పేరుకే  స్మాల్ మూవీ కానీ కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇలా పెద్ద సినిమాలతో ప్యారలల్ గా స్మాల్ మూవీని కూడా తెరపైకి తీసుకొస్తున్న మైత్రీ వారి దృష్టి తాజాగా మరో స్మాల్ మూవీపై పడింది. అదే `అరి`. టాలెంట్ ఎక్కడ వున్నా వారికి అండగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ `అరి` సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. `పేపర్ బాయ్` సినిమా తరువాత జయశంకర్ డైరెక్ట్ చేస్తున్న రెండం చిత్రం `అరి`.  `మై నేమ్ ఈజ్ నో బడీ` అనేది ట్యాగ్ లైన్.

వ్యాపార వేత్తలు శేషు మారం రెడ్డి శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అనసూయ సాయి కుమార్ వైవా హర్ష శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి మైత్రీ వారు సహ భాగస్వామిగా వ్యవహరించబోతున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైత్రీ ప్రొడ్యూసర్ రవిశంకర్ చిత్ర బృందం తో చర్చలు జరుపుతున్నారట. `అరి` మేకర్స్ మైత్రీ వారికి సన్నిహితులు కావడంతో ఈ ప్రాజెక్ట్ కు అసోసియేట్ గా  మైత్రీ యాడ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

అంతే కాకుండా ఈ మూవీ డైరెక్టర్ జయశంకర్ తోనూ ఓ మూవీ చేయాలని మైత్రీ వారు ప్లాన్ చేస్తున్నారట. `అరి` డైరెక్టర్ జయశంకర్ త్వరలో నయనతార కీలక పాత్రలో ఓ పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ మూవీని చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని మైత్రీ వారే నిర్మించే అవకాశం వుందని తెలుస్తోంది.